యువతుల పెళ్లి వయస్సుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం : ప్రధాని మోడీ

ఆగస్టు 15..దేశమంతా పండుగ. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్రమడీ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్, జీఎస్టీ, నూతన విద్యావిధానం వంటి వాటిపై సమగ్రంగా ప్రసంగించారు. మన దేశంలో యువతుల పెళ్లి వయసుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నామని..దీనికి సంబంధించిన ఓ కమిటీని నిరయమించామని కమిటీ నివేదిక వచ్చిన తరువాత యువతుల వివాహం విషయంపై ఓ నిర్ణయం తసుకుని ప్రకటిస్తామని తెలిపారు. మహిళల్లో పోషకాహార లోపాల నివారణకు చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. దేశంలో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవితష్యత్తు ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. పోషకాహార లోపం అనేది చాలా ప్రమాదమని దాన్ని సమూలంగా నివారించే చర్యల్లో భాగంగా పోషకాహార లోపాలను నివారించటానికి చర్యలు ప్రారంభించామని తెలిపారు.
Committee set up to reconsider minimum age of marriage for women: PM Modi
Read @ANI Story| https://t.co/f0Qd9BbsqY pic.twitter.com/0goljUQm7Q
— ANI Digital (@ani_digital) August 15, 2020
జీఎస్టీతో వస్తువుల ధరలు తగ్గాయి..
వెయ్యి రోజుల్లో ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ నెట్‌ను తీసుకెళ్లామని, ఆరేళ్లలో లక్షన్నర గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. జీఎస్టీతో చాలా వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని..ఈ విధానం వచ్చిన తరువాత ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందనీ మోసాలకు తావు లేకుండా వస్తువుల కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు.
కరోనా వ్యాక్సిన్ కోసం మన శాస్త్రవేత్తలు పరిశోధనల్ని తపస్సులా చేస్తున్నారు
ప్రపంచానికి గొప్ప వృత్తి నిపుణులను అందించిన ఘనత భారత మధ్యతరగతిదేనని మోడీ అన్నారు. భారత్‌లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రధాని మాట్లాడుతూ.. కరోనాను అంతమొందించే టీకా కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ కోసం మన శాస్త్రవేత్తలు తపస్సులా పరిశోధనలు చేస్తున్నారని కొనియాడారు. వారి శ్రమ త్వరలోనే ఫలిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు వ్యాక్సిన్లు తుది దశ పరీక్షల్లో ఉన్నాయని ప్రధాని వివరించారు.