ధర్నాలతో బాబు డ్రామాలు :  ఈసీకి బీజేపీ ఫిర్యాదు 

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి ఏపీ బీజేపీ నేతలు కలిసి  సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 11:35 AM IST
ధర్నాలతో బాబు డ్రామాలు :  ఈసీకి బీజేపీ ఫిర్యాదు 

Updated On : April 10, 2019 / 11:35 AM IST

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి ఏపీ బీజేపీ నేతలు కలిసి  సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి ఏపీ బీజేపీ నేతలు కలిసి  సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. దొంగే దొంగ అని అరుస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారనీ..ఇప్పుడు ధర్నాలంటే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. 
Read Also : వారణాశిలో ఏప్రిల్-26న మోడీ నామినేషన్

ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులైపారుతోందని.. డీజీసీ టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారనీ  తాము ఈసీకి పలుమార్లు ఫిర్యాదు చేశామని విమర్శించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతంలో డీఎస్పీల పర్యవేక్షణలోనే డబ్బులు పంచుతున్నారనే విషయాలకు  తమ దృష్టికి వచ్చాయని కన్నా తెలిపారు. వారి వాహనాలకు ఎవ్వరూ చెక్ చేయరనే ధీమాతో  సాక్షాత్తు పోలీసులు వాహనాల్లోనే డబ్బు తరలిపోతోందనీ కన్నా ఆరోపించారు. టీడీపీ నేతలకు సంబంధించిన కాలేజీలు, ఆస్పత్రులు మనీ బ్యాంకింగ్ ప్లేసులుగా మారిపోయాయని..అక్కడి నుండి ఓటర్లకు డబ్బు పంపిణీ జరగుతోందన్నారు. 

కాగా కేంద్ర ఎన్నికల సంఘంపై రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈసీ తీరుపై  కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి తన ప్రతినిధులను ఢిల్లీ  పంపిన చంద్రబాబు  బుధవారం (ఏప్రిల్ 10)అమరావతి లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కూడా  కలిసి వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆఫీసు బయటకు వచ్చి ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.  
Read Also : ఏప్రిల్-11కు ఏర్పాట్లు పూర్తి…. పోలింగ్ జరగనున్న స్థానాలివే