ఆయేషా మీరా హత్య కేసు సీబీఐకి బదిలీ
ఆయేషా మీరా హత్య కేసు అత్యంత సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయేషా హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

ఆయేషా మీరా హత్య కేసు అత్యంత సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయేషా హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.
హైదరాబాద్ : ఆయేషా మీరా హత్య కేసు అత్యంత సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయేషా హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయేషా మీరా హత్య కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. కేసు దర్యాప్తు వేగం పుంజుకోనుంది. అసలు నిందితులను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు విఫలమయ్యారని.. కేసును సీబీఐకి బదిలీ చేసింది ఉన్నత న్యాయస్థానం. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ మళ్లీ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది.
2007 లో ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య
ఉమ్మడి రాష్ట్రంలో 11 సంవత్సరాల క్రితం 2007 డిసెంబర్ 28 తేదీన ఇబ్రహీంపట్నంలో శ్రీదుర్గ హాస్టల్ అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య గావించబడింది. అసలు నిందితులను ఎరన్నది గుర్తించడంలో ఏపీ పూర్తిగా విఫలం కావడంతో కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై, ప్రత్యేక ఎఫ్ ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేసింది. విజయవాడకు చేరుకున్న నాలుగు బృందాలు గతంలో ఇదే కేసులో అరెస్టై బయటికి వచ్చిన సత్యంబాబు, ఆయేషా మీరా తల్లిదండ్రులను విచారించేందుకు సీబీఐ అధికారులు సిద్ధం అయ్యారు.
ఏపీ పోలీసు ఇన్వెస్టిగేషన్ పున:పరిశీలన
ఇప్పటికే ఏపీ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా పున:పరిశీలించి, కేసులో అసలు దోషులు ఎవరన్నదానిపై దర్యాప్తు చేసింది. విజయవాడలోని శ్రీదుర్గా హాస్టల్, అలాగే ఆయేషా మీరా తల్లిదండ్రులను, ఈ కేసులో అరెస్టై ఇటీవలే నిర్దోషిగా బయటికి వచ్చిన సత్యంబాబును సీబీఐ మరోసారి విచారించే అవకాశం ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు మనుమళ్లు ఈ దాడికి పాల్పడ్డారని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సత్యం బాబు నిర్దోషి అని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసు ఉన్నతాధికారులపై అనుమానం ఉన్న నేపథ్యంలో వారిని కూడా మరోసారి విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ. మరి అసలు దోషులెవరన్నది సీబీఐ దర్యాప్తులో తెలుస్తుందా… అనేది వేచిచూడాల్సిందే.