దేశంలో 25లక్షల కరోనా కేసులు.. 24గంటల్లో 65వేలకు పైగా కేసులు

భారతదేశంలో కరోనావైరస్ సోకిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా కొత్త రోగులు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గత 24 గంటల్లో దేశంలో కరోనా రోగుల సంఖ్య 25 లక్షలను దాటింది. 65వేల 2 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 996 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు వచ్చిన తరువాత, దేశంలో కరోనా సోకిన రోగుల సంఖ్య 25 లక్షల 26 వేల 192కు పెరిగింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 6 లక్షల 68 వేల 220 క్రియాశీల కరోనా కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు 49 వేల 36 మంది మరణించారు. అదే సమయంలో ఇప్పటివరకు 18 లక్షల 8 వేల 936 మంది కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయం. దేశంలో మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితం అయిన రాష్ట్రంగా ఉంది.
శుక్రవారం, మహారాష్ట్రలో కొత్తగా 12,608 కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 5,72,734గా ఉంది. ఆరోగ్య శాఖ ప్రకారం, ఈ కాలంలో 364 మంది రోగులు కరోనాతో మరణించారు. రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 19,427 కు పెరిగింది. ఆరోగ్య శాఖ ప్రకారం, మహారాష్ట్రలోని కోవిడ్ -19 నుంచి 4,01,442 మంది కోలుకున్నారు.