గుంటూరులో యుద్ధం : మోడీ టూర్‌పై సెగలు

  • Published By: madhu ,Published On : February 9, 2019 / 12:52 PM IST
గుంటూరులో యుద్ధం : మోడీ టూర్‌పై సెగలు

Updated On : February 9, 2019 / 12:52 PM IST

విజయవాడ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి నుండే రాజకీయాలు హీట్ హీట్‌గా మారిపోయాయి. మోడీ గో బ్యాక్ పేరిట బ్యానర్లు వెలిశాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై .. రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు..నిరనలు చేపట్టాయి. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చలేదని ప్రతిపక్ష నేతలు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. 

బాబు పిలుపు : – 
మరోవైపు రాష్ట్రానికి ఏమి ఇవ్వని మోడీ..ఏం మొహం పెట్టుకుని వస్తున్నారంటూ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా చేపట్టే నిరసనలు దేశమంతా తెలిసేలా నిర్వహించాలని.. ఉదయం టీడీపీ నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఎక్కడికక్కడ ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తూ మోడీ నోరు పారేసుకుంటున్నారని, గుంటూరు వచ్చి అదే ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలంతా పసుపు చొక్కాలు ధరించి ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని కోరారు. 

సక్సెస్ కోసం బీజేపీ నేతల ప్రయత్నం : – 
సభను సక్సెస్ చేయాలని కాషాయ దళాలు శ్రమిస్తున్నాయి. గుంటూరూలోనే మకాం వేసిన బీజేపీ కీలక నేతలు జనసమీకరణపై దృష్టి సారించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనలో ఓ సభ సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే. పునరావృతం కాకుండా నేతలు కృషి చేస్తున్నారు.  ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. సభను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చిస్తున్నారు. యాక్షన్‌కు రియాక్షన్‌ చూపిస్తామన్నారు. 

ఇక మోడీ పర్యటనలో ఎలాంటి అంశాలపై స్పందిస్తారోనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ఏమి చేశామో చెబుతారా ? లేక కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారా ? విమర్శలకే పరిమితమౌతారా ? అనేది చూడాల్సి ఉంటుంది.