రాజస్థాన్ రాయల్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్: మ్యాచ్ ప్రీవ్యూ.. జట్ల బలాబలాలు.. పంత్ Vs శాంసన్.. నేడు పరుగుల వర్షమే!

IPL 2020 DC Vs RR: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం రాత్రి 7:30 గంటలకు షార్జా మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఢిల్లీ ఈ సీజన్‌లో అద్భుతంగా ప్రదర్శన ఇస్తుండగా.. 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. అదే సమయంలో, రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. రాజస్థాన్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలవగా.. వరుసగా గత 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్ జరిగే గ్రౌండ్ చిన్నది కాగా.. రెండు జట్లలో సిక్సర్లు కొట్టే ఆటగాళ్లు ఎక్కువగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తుంది.
పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం కోసం:
పాయింట్ల పట్టికలో 4 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ ఢిల్లీ కంటే ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నేటి మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే, అది 10 పాయింట్లు పొందుతుంది. పాయిట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వస్తుంది.
షార్జాలో రాజస్థాన్ రికార్డు:
ఈ ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ ఏడవ స్థానంలో ఉన్నప్పటికీ, షార్జా మైదానంలో వారి రికార్డు మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు గెలవగా.. రెండు మ్యాచ్‌లు షార్జా మైదానంలోనే.. అటువంటి పరిస్థితిలో, రాజస్థాన్ రాయల్స్ ఈ మైదానంలో తమ రికార్డును కొనసాగించే అవకాశం ఉంది. రాజస్థాన్ జట్టు గత మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఈ మ్యాచ్ మాత్రం కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉంది.
Delhi Capitals Playing XI(అంచనా):
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (సి), రిషబ్ పంత్ (wk), షిమ్రాన్ హెట్మీయర్, మార్కస్ స్టోయినిస్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే
Rajasthan Royals Playing XI(అంచనా):
జోస్ బట్లర్ (WK), యశస్వి జైస్వాల్, స్టీవెన్ స్మిత్ (C), సంజు శాంసన్, మహిపాల్ లోమోర్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్, వరుణ్ అరోణ్, కార్తీక్ త్యాగి
అందుబాటులోకి రాని స్టోక్స్:
రాజస్థాన్ జట్టు కీ ప్లేయర్ బెన్ స్టోక్ప్ ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉన్నాడు. క్వారంటైన్ కాలం ఇంకా ముగియకపోవడంతో మ్యాచ్‌కు అందుబాటులోకి రాలేదు. రాజస్థాన్ తర్వాత ఆడే మ్యాచ్‌కు స్టోక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
జట్ల బలాబలాలు:
చివరి గేమ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. రాబిన్ ఉత్తప్ప మరియు ఉనద్కట్‌లను పక్కనబెట్టి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈసారి వరుణ్ అరోన్‌కి ఆర్ఆర్ అవకాశం ఇవ్వవచ్చు.
మీకు తెలుసా?
– ఈ సీజన్‌లో Delhi Capitals స్పిన్నర్లు అత్యంత పొదుపుగా(ఎకానమీ రేట్:6.13) బౌలింగ్ చెయ్యగా.. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్లు మాత్రం చాలా ఎక్కువగా (9.12) పరుగులు సమర్పించుకున్నారు. ఈ స్టేడియంలో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో వారి పాత్ర కూడా కీలకం కానుంది.
– ఇక పంత్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తన చివరి మూడు ఇన్నింగ్స్‌లలో 69(29), 78*(36) మరియు 53*(38) పరుగులు చేశాడు. ఇక ఐపిఎల్ -13 లో పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో 171పరుగులు చేశాడు. అంతేకాదు.. పంత్ లెగ్ సైడ్ మాత్రమే ఆడగలడ అనే అపకీర్తిని పంత్ పోగొట్టుకుంటున్నాడు. ఆఫ్ సైడ్ కూడా వేగంగా పరుగులు రాబడుతున్నాడు.
– 2019 లో మంకాడ్ తొలగింపు తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ ముఖాముఖి రాబోతున్నారు. Mankad dismissal అప్పట్లో ఎంత కాంట్రవర్శియల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రిషబ్ పంత్ Vs సంజు శాంసన్:
ఈ మ్యాచ్‌లో కీలకంగా ఇద్దరి ఆటగాళ్లపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. టీమిండియా కీపర్లు రేసులో ఉన్న ఈ ఇద్దరి ఆటతీరుపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరి ఆటతీరు మెరుగ్గా ఉండబోతుంది అనేది కచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించే అంశమే.