దిశ కేసు : ఎన్‌కౌంటర్ జరిగిన తీరుని పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ
చటాన్‌పల్లిలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెళ్లింది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుని పరిశీలిస్తున్నారు.

చటాన్‌పల్లిలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెళ్లింది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుని పరిశీలిస్తున్నారు.
చటాన్‌పల్లిలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెళ్లింది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుని పరిశీలిస్తున్నారు. శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్ కౌంటర్ కు సంబంధించి వివరాలను డీసీపీ నుంచి సేకరిస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు రిలీజ్ చేసిన ఫొటో గ్రాఫ్స్ తోపాటు వారికి చేరినటువంటి కొన్ని ఫొటోగ్రాఫ్స్ ను పరిశీలిస్తున్నారు. ఫొటో గ్రాఫ్స్ కు, ఫీల్డ్ లో ఉన్న పొజిషన్స్ చూస్తున్నారు. రిపోర్టులోని అంశాలకు సంబంధించి స్థానిక పోలీసుల నుంచి తీసుకుంటున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా వారి వెంట తీసుకెళ్లారు. నిపుణుల సమక్షంలో వివరాలు సేకరిస్తున్నారు.
అంతకముందు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురి మృతదేహాల్ని మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం పరిశీలించింది. మూడు గంటల పాటు పోస్టుమార్టం రిపోర్ట్‌ను అధ్యయనం చేసింది. మృతదేహాలపై బుల్లెట్ గాయాలతోపాటు వారి శరీరంలో దిగిన బుల్లెట్లను క్షుణ్నంగా పరిశీలించింది. పోస్టుమార్టం రిపోర్ట్‌ను అధ్యయనం చేసేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం వెంట ఫోరెన్సిక్ నిపుణులు సైతం వచ్చారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు.
అనంతరం హక్కుల కమిషన్ సభ్యులు నలుగురు మృతుల కుటుంబీకులతో మాట్లాడారు. నలుగురి కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు వెళ్లారు.
దిశ హత్యాచార నిందితులను పోలీసులు శుక్రవారం(డిసెంబర్ 6, 2019) తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు.
(నవంబర్27, 2019) దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. దిశ కేసులో నిందితులను గురువారం (డిసెంబర్5, 2019) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.