డాక్టర్లు నిర్లక్ష్యం.. తల్లికి కడుపుకోత: పగిలిన శిశువు తల

నవ మాసాలు మోసిన బిడ్డ మరికొద్ది సేపట్లో బయటకు వస్తుందని ఆశగా భావిస్తుంది తల్లి. బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు తండ్రి.
తమ కుటుంబంలోకి కొత్తగా మరో వ్యక్తి రాబోతున్నాడు అని ఆనందంలో ఉన్న బంధువులకు బాధనే మిగిల్చారు. బిడ్డ చనిపోతే తల్లికి ఎంత కడుపుకోత.. అదే కడుపుకోతను మిగిల్చారు అక్కడి డాక్టర్లు.
డెలివరీ చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల పగిలి మెదడు బయటకు రావడంతో ఓ శిశువు చనిపోయాడు. ఈ ఘటన విశాఖపట్నంలోని ఘోషా ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
డెలివరీ చేసే సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శిశువు తల పగిలి మెదడు బయటకు వచ్చేసింది. దీంతో శిశువు చనిపోగా.. మృతదేహంతో బంధువుల ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు.