కీలకమైన తూర్పుగోదావరి: 16 సీట్లు ఖరారు

  • Published By: vamsi ,Published On : March 15, 2019 / 06:28 AM IST
కీలకమైన తూర్పుగోదావరి: 16 సీట్లు ఖరారు

Updated On : March 15, 2019 / 6:28 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దుక్కించుకోవాలనుకునే పార్టీకి ముఖ్యమైన జిల్లాగా చెప్పుకునే జిల్లా తూర్పు గోదావరి జిల్లా. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో మాల, శెట్టిబలిజ, యాదవ, పద్మశాలి, రజక, నాయి బ్రాహ్మణ కులాలు కీలకంగా ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్లు అయిన ఎందరో నేతలు ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, హోం మంత్రి చినరాజప్ప, శాసనమండలి డిప్యూటి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, జ్యోతుల నెహ్రు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారు జిల్లా నుంచి టీడీపీకి బలమైన నాయకత్వంగా ఉన్నారు.
Read Also: అక్కడ ఎంపీని డిసైడ్ చేసేది మహిళలే

గత ఎన్నికల్లో జిల్లాలో 12స్థానాలు కైవసం చేసుకున్న తెలుగుదేశం వైసీపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల చేరికతో ప్రస్తుతం 16సభ్యుల బలంతో ఉంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉండగా.. తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, పెద్దాపురం, అనపర్తి, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, ముమ్మిడివరం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. పిఠాపురం, అమలాపురం, రంపచోడవరం నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్ధులను ప్రకటించలేదు.

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
ఓసీలు- 09
బీసీలు-05
ఎస్సీలు-02

తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు:

1. తుని – యనమల రామకృష్ణుడు 
2. పత్తిపాడు – వరపుల జోగిరాజు (రాజా) 
3. కాకినాడ రూరల్ – పిల్లి అనంత లక్ష్మీ 
4. పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప 
5. అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి 
6. కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వర రావు 
7. రామచంద్రాపురం – తోట త్రిమూర్తులు 
8. ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు 
9. రాజోలు – గొల్లపల్లి సూర్యారావు 
10. గన్నవరం – నెలపూడి స్టాలిన్ బాబు 
11. కొత్తపేట – బండారు సత్యనారాయణ 
12. మండపేట – వేగుళ్ల జోగేశ్వర రావు 
13. రాజానగరం – పెందుర్తి వెంకటేష్ 
14. రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి భవానీ 
15. రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి 
16. జగ్గం పేట – జ్యోతుల నెహ్రూ 

ఖరారు కాని స్థానాలు:
పిఠాపురం
అమలాపురం
రంపచోడవరం