అమరావతి నిర్మాణానికి : వృద్ధురాలు రూ.50 వేలు సాయం
వృద్ధురాలు అమరావతి నిర్మాణానికి తన వంతు సాయంగా 50వేల రూపాయలు అందజేసింది.

వృద్ధురాలు అమరావతి నిర్మాణానికి తన వంతు సాయంగా 50వేల రూపాయలు అందజేసింది.
అనంతపురం : జిల్లాలోని చెర్లోపల్లిలో జరిగిన బహిరంగ సభలో.. రామగిరి మండలానికి చెందిన బండి ముత్యాలమ్మ అనే వృద్ధురాలు అమరావతి నిర్మాణానికి తన వంతు సాయంగా 50వేల రూపాయలు అందజేసింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇస్తున్న పింఛన్లను దాచిపెట్టి 50 వేలు పోగు చేశానని ముత్యాలమ్మ తెలిపింది. అందుకు చలించిపోయిన సీఎం చంద్రబాబునాయుడు.. ఇలాంటి వారి ఆశీర్వాదం తీసుకోవాలంటూ ఆమెకు పాదాభివందనం చేశారు.