ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి ఎన్నికల కోడ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. దీంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. ఎన్నికల సంఘం పోల్ షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ (Model Code of Conduct (MCC)) అమల్లోకి వచ్చేసింది.
ఈ కోడ్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఏం చెయ్యవచ్చో, ఏం చెయ్యకూడదో క్లియర్‌గా స్పష్టం చేస్తుంది. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రావడంతోనే ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అంటే స్కీముల్లో మార్పులు, చట్టాల్లో సవరణలు, కొత్త పథకాలు తీసుకుని రావడం చెయ్యకూడదు.
ఎన్నికలు సజావుగా జరగాలంటే రాజకీయ పార్టీలూ, నేతలూ కొన్ని రూల్స్ పాటించాలి. వాటినే ఎన్నికల నిబంధనావళి అంటున్నారు. ఈ రూల్స్‌లో రాజకీయ నేతలు చేసే ప్రకటనలు, ప్రసంగాలు, పోలింగ్ తేదీలు, పోలింగ్ బూత్‌లు, శాఖలు, ఎన్నికల మేనిఫెస్టోలు, సంప్రదాయంగా వస్తున్న అంశాలు అన్నీ ఉంటాయి. వీటిని పక్కాగా పాటిస్తే, ఎన్నికలు సజావుగా సాగుతాయి.
రాష్ట్రంలో మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు, రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి.
* మార్చి 9 నుంచి 11వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు
* మార్చి 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
* ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికలు, 27న ఫలితాలు
* ఈ నెల 27న తొలి విడత పంచాయతీ ఎన్నికలు
* 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు
See Also | కరోనా అప్‌డేట్: లక్ష దాటిన బాధితులు.. ఇండియాలో 31