పార్టీలో ఎవ్వరినీ మాట్లాడనివ్వరు.. అతనిలో మంచి మాయమైంది : పవన్ కళ్యాణ్‌పై రాజు రవితేజ

జనసేన పార్టీకి కీలక నేత రాజు రవితేజ దూరం అయ్యారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉన్న రాజు రవితేజపై పవన్ కళ్యాణ్ కూడా పలు సంధర్భాల్లో ప్రశంసలు కురిపించారునసేనకు రాజీనామా చేసిన రాజు రవితేజ 10Tvలో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎప్పుడూ బయట. జకు కనిపించని రాజు రవితేజ సుధీర్ఘ ప్రయాణం తర్వాత పవన్ కళ్యాణ్‌తో విడిపోయి బయటకు వచ్చి ఆయనపై విమర్శలు గుప్పించారు.
జనసేన ఎప్పుడూ ఎన్నికల్లో కంటెస్ట్ చెయ్యలేదు కాబట్టి అంతకుముందు వ్యక్తుల గురించి అర్థం కాలేదని, ఎలక్షన్స్ 2019లో కంటెస్ట్ చేసినప్పుడు అసలు కోణాలు బయటకు వచ్చినట్లు చెప్పారు. జనసేనని ఫస్ట్‌లో నడిపించిన అందరిలో తానే లాస్ట్ వికెట్ అని అన్నారు. జనసేన ఓ క్రికెట్ టీమ్ అనుకుంటే కెప్టెన్ పవన్ కళ్యాణ్ అని అయితే కెప్టెన్‌గానే కాక మిగిలిన విభాగాల్లో కూడా ఆయన ఫెయిల్ అయ్యారని అన్నారు.
పొలిట్ బ్యూరోలో ఫస్ట్ వ్యక్తిని నేనే అని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇజం రాసింది నేనే అని చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా మారిపోయాయి అని చెప్పారు. మూడు పేజీల లెటర్ ఎందుకు రాజీనామా చేస్తున్నాను అనే విషయాన్ని క్లియర్‌గా పవన్ కళ్యాణ్‌కి చెప్పినట్లు తెలిపారు. రిజైన్ లెటర్ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తూ.. జగన్ మాత అనే పదం పవన్ కళ్యాణ్ వాడాడని, జగన్ కోసం రాజీనామా చేసినట్లు వచ్చే విధంగా ఆ మాట ఉందని అందులో నిజం లేదని అన్నారు. నేను కుట్రలు చెయ్యలేదు అని అన్నారు.
క్రెడిబిలిటీ మీద ప్రశ్నలు వస్తున్నాయని జనసేన తొలి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన రాజీనామా చేసి కెమెరా ముందుకు వచ్చినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్‌లో ఉన్న మంచిని ఆయన ఎప్పుడో వదిలిపెట్టేశాడు అని అన్నారు రాజు రవితేజ. కులం పేరుతో.. మతం పేరుతో వల్గర్ స్పీచ్ ఇవ్వడంతో జనసేన సిద్ధాంతాలు పక్కన పెట్టేశారని అన్నారు. కులాలను కలిపే రాజకీయం, మతాల ప్రస్తావన లేని రాజకీయం అని సిద్ధాంతాలు పెట్టుకుని కులాలు, మతాలు లేకుండా మాట్లాడట్లేదని అన్నారు. అక్కడకెళ్లి రెడ్డి అంటారు.. ఇక్కడికొచ్చి హిందూ అంటారు. ఆయన చెప్పేది కరెక్ట్ అంటారని చెప్పారు. 99శాతం పార్టీలో ఎవ్వరినీ మాట్లాడనివ్వరని చెప్పుకొచ్చారు.