రైతుల నిరసనలు : రాజధానిని అమరావతి నుంచి మార్చొద్దు
సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. 11వ రోజు కూడా ఆందోళనలు, వినూత్న నిరసనలతో హోరెత్తించారు.

సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. 11వ రోజు కూడా ఆందోళనలు, వినూత్న నిరసనలతో హోరెత్తించారు.
సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని తేల్చిచెప్పారు అమరావతి రైతులు. 11వ రోజు కూడా ఆందోళనలు, వినూత్న నిరసనలతో హోరెత్తించారు. ముఖ్యంగా శుక్రవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్, జీఎన్ రావు కమిటి నివేదికపై రాజధాని ప్రాంత రైతులు తీవ్రంగా మండిపడ్డారు. రోడ్లపై బైటాయింపు, వంటా వార్పు, రహదారుల దిగ్బంధం.. ఇలా 11వ రోజు కూడా రాజధాని రైతుల నిరసనలు కొనసాగాయి. రాజధానిని అమరావతి నుంచి మారిస్తే ఊరుకునేది లేదంటూ మహిళలు కదం తొక్కారు. వెలగపూడిలో మహిళల ఆగ్రహం పెల్లుబికింది. రాజధానిపై కమిటీలతో కాలయాపన చేయొద్దంటూ నినాదాలు చేశారు. జీఎన్ రావు కమిటీ బోగస్ అని, మంత్రుల ప్రకటనలు గందరగోళంగా ఉందని విమర్శించారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలంటూ డిమాండ్ చేశారు.
క్యాబినెట్ మీటింగ్ తర్వాత కూడా రాజధాని విషయంపై సృష్టత రాకపోవడంతో తుళ్లూరు, మందడం రైతులు రోడ్లపై ధర్నా చేపట్టారు. మందడంలో అయితే రోజురోజుకూ పోరాటం ఉధృతం అవుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు రైతులు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారిని నిర్బంధించారు. రైతుల నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. తుళ్లూరులో వంటా వార్పు చేపట్టారు.
రాజధానిపై దొంగ కమిటీలు వద్దంటూ రైతులు నినాదాలు చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రభుత్వం ప్రకటన చేసేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు రైతులు. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ తాడికొండ రైతులు ఆందోళన చేపట్టారు. పొన్నెకల్లు తాడికొండ కూడలికి చేరుకున్న రైతులు ధర్నా చేశారు. జీఎన్‌రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం చేపట్టడంతో .. ట్రాఫిక్ జామ్ అయింది.