ఒంగోలులో ఫైర్ ఆక్సిడెంట్

ఒంగోలులోని రీబటన్ టైర్ల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని…మంటలు ఆర్పేందుకు మూడు గంటలుగా శ్రమిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.
ఇస్లాంపేటలోని మసీదు సెంటర్ వద్ద రీబటన్ టైర్ల గోడౌన్ ఉంది. ఎప్పటిలాగానే మే 10వ తేదీ శుక్రవారం మూసివేసి సిబ్బంది వెళ్లిపోయారు. మే 11వ తేదీ శనివారం తెల్లవారుజామున గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. స్థానికులు కంపెనీ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న గోడౌన్ సిబ్బంది..అగ్నిమాపక శాఖకు ప్రమాద విషయాన్ని తెలియచేశారు.
అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడతుండడం..దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సుమారు రూ. 10 నుంచి రూ. 15 లక్షలకు వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.