కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు

గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు లొంగిపోయారు. ఆత్మకూరు పోలీసులపై దుర్భాషలాడిన కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాడుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి కోర్టు ఇచ్చిన సూచనల మేర రూ.50వేలు పూచీకత్తు కట్టడంతో అచ్చెన్నాయుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
గత సెప్టెంబర్ నెలలో గుంటూరు జిల్లాలో టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్ చేసిన మాజీ చంద్రబాబుని కలిసేందుకు ఆయన నివాసానికి వెళుతుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ తీవ్ర పదజాలంతో దూషించారు.
ఎస్పీ విక్రాంత్ పటేల్ ను యూజ్ లెస్ ఫెలో అంటూ దూషించారు. దీంతో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు కోర్టుకు వెళ్లింది. కోర్టు ఇచ్చిన సూచనల మేరకు అచ్చెన్నాయుడు రూ.50వేలు పూచీ కత్తును సమర్పించటంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.