EXCLUSIVE:జీఎన్ రావు కమిటీపై మైసూరా : జగన్ నిర్ణయాలే నివేదికలో ఉంటాయి..వారికి సొంత ఆలోచనలుండవ్

ఏపీకి త్రీ క్యాపిటల్స్ ఇష్యూ..జీఎన్ రావు కమిటీపై మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ వేసిన జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ సీఎంకు అనుకూలంగానే ఇస్తుందని తప్ప వ్యతిరేకంగా ఎందుకిస్తుంది? అనుకూలంగా ఇస్తుంది. ఇది అందరికీ తెలిసున్నా విషయమేనని అన్నారు మైసూరా రెడ్డి. సీఎం ఎలా చెబితే జీఎన్ రావు కమిటీ అదే చేసిందనీ కమిటీ కూడా అదే పేర్కొంది అని మైసూరా తేల్చేశారు.
ఏ సీఎం కమిటీ వేసినా ఆ సీఎంకు అనుకూలంగా కమిటీలు నివేదికలను తయారు చేస్తాయనీ..ఇప్పుడు జీఎన్ రావు కమిటీకూడా అదే చేసిందనీ సీఎం జగన్ చెప్పినట్లగానే..ఆయన నిర్ణయించినట్లుగానే కమిటీ నివేదికను తయారు చేసిందని మైసూరా అన్నారు. తమకు అనుకూలంగా రిపోర్ట్ తయారు చేసేవారినే సీఎం కమిటీ సభ్యులుగా..కమిటీ చైర్మన్ గా ఎంపిక చేస్తారని అన్నారు.
అసలు జీఎన్ రావు కమిటీ ఎక్కడ సర్వే చేశారు? ఎవరిని ప్రశ్నించారు? అసలు వారు ఏ ప్రాంతంలో పర్యటించారు? అని ప్రశ్నించారు. ఇదంతా సీఎం జగన్ ఆదేశాలతోనే కమిటీ రిపోర్ట్ ను తయారు చేసిందని..సీఎం కోరినట్లుగానే నివేదిక ఇచ్చిందని అన్నారు. అంతేతప్ప సీఎంలు వేసిన కమిటీ కమిటీకి..కమీ సభ్యులకు ప్రత్యేకించి సొంత అభిప్రాయాలు..ఆలోచనలు..స్వంత్రతా ఉండని తేల్చి చెప్పారు.