ఒకటా, మూడా : ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రెడీ
ఏపీ రాజధాని అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ఒక రాజధాని ఉంటుందా.. లేక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని అంశంపై ప్రభుత్వం

ఏపీ రాజధాని అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ఒక రాజధాని ఉంటుందా.. లేక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని అంశంపై ప్రభుత్వం
ఏపీ రాజధాని అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ఒక రాజధాని ఉంటుందా.. లేక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజధానితో పాటు పలు అంశాలపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదిక సిద్ధం చేసింది. జీఎన్ రావు కమిటీ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు నివేదికతో సహా చేరుకుంది. రాజధానిపై సీఎం జగన్ కు జీఎన్ రావు కమిటీ తమ నివేదిక ఇవ్వనుంది. రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. కేపిటిల్ గురించి కమిటీ సభ్యులు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వాటి ఆధారంగా ఓ నివేదికను రూపొందించారు. ఆ రిపోర్ట్ సీఎం జగన్ దగ్గరికి వచ్చింది. కాగా, తమ నివేదికలో జీఎన్ రావు కమిటీ.. ఏం చెప్పింది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ రావొచ్చు అని సీఎం జగన్ అన్నారు. కాగా, జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. దీంతో ఏపీ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి ఒక కేపిటల్ ఉంటుందా.. లేక మూడు రాజధానులు ఉంటాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కారు. సీఎం ప్రకటనకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. మూడు వద్దు ఒకటే ముద్దు అని నినాదాలు చేస్తున్నారు. సీఎం జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోణంలో మూడు రాజధానులు ఉంటే తప్పేమీ లేదు అనే వారూ ఉన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ.. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. రాజధానిపై జరిపిన అధ్యయనంపై ఆ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి మధ్యంతర నివేదికలు అందజేసినట్లు సమాచారం. విశాఖ, కర్నూలు, అమరావతితో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధిని పరిశీలించిన కమిటీ..ఏ ప్రాంతంలో ఏది అనువుగా ఉంటుందనే కోణంలో అధ్యయనం చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 40వేల వినతులను పరిశీలించింది. దీనికి సంబంధించిన తుది నివేదికను సీఎం జగన్ కు అందజేయనుంది. ఏపీకి 3 రాజధానులు రావొచ్చు అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. జీఎన్ రావు కమిటీ నివేదికపై సర్వత్రా ఉత్కంఠి నెలకొంది.
* ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రెడీ
* జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ పై సర్వత్రా ఉత్కంఠ
* ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటన
* సీఎం ప్రకటనతో రాజధానిలో రైతులు ఆందోళన
* రాజధాని తరలింపుపై కమిటీ తన నివేదికలో ఏం చెప్పింది
* అన్ని ప్రాంతాల అభివృద్ధికి జీఎన్ రావు కమిటీ చేసిన సూచనలేంటి
* నిపుణుల కమిటీ సూచనలపై రాజకీయ పార్టీల్లో తీవ్ర ఆసక్తి
* 2019 సెప్టెంబర్ 13న జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు
* రాజధానిపై ప్రజల అభిప్రాయాలు సేకరించిన కమిటీ సభ్యులు
Also Read : 30 రాజధానులు పెట్టుకుంటాం : రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం