ఉప్పల్‌కు గోవర్ధన్ మృతదేహం

అమెరికాలోని ఫ్లోరైడ్‌లో నల్ల జాతీయులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన గోవర్ధన్ మృతదేహం ఉప్పల్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం చేరుకున్న మృతదేహాన్ని సొంత గ్రామమైన యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రైకంపేట గ్రామానికి తరలించారు. గోవర్ధన్ మృతదేహాన్ని చూసిన బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి గోవర్ధన్ రెడ్డి బాడీ రాగా, గురువారం తెల్లవారు జామున ఉప్పల్ లోని నివాసానికి చేరుకుంది.
గోవర్ధన్ రెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్ పెట్ గ్రామానికి చెందిన వారు. 7 సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా అమెరికాలోని ఫ్లోరిడాకి వెళ్ళాడు. ఇతనికి భార్య రాణి, ఇద్దరు కుమార్తెలు శ్రేయ పదో తరగతి చదువుతుండగా, తులసి 7వ తరగతి చదువుతోంది. ఇతని భార్య, పిల్లలు ఉప్పల్‌లోని స్వరూప్ నగర్ ఫ్రెండ్స్ కాలనిలో ఓ అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటున్నారు.
ఫ్లోరిడాలో డిపార్ట్మెంటల్ స్టోర్‌లో మేనేజర్‌గా గోవర్ధన్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం స్టోర్‌లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గోవర్ధన్ రెడ్డి చనిపోగా, మరొక వ్యక్తికి గాయాలయ్యాయి.