చలో వారణాసి: మోడీకి గురిపెట్టిన తెలంగాణ రైతులు

తెలంగాణలోని నిజామాబాద్‌లో కవితపై పోటీ చేసి దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్న పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల పరిష్కారం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీకి దిగుతున్నారు. ప్రధాని మోడీ రెండవసారి పోటీ చేస్తున్న వారణాసి నుంచి పెద్ద సంఖ్యలో బరిలోకి దిగాలని నిజమామాద్ రైతులు నిర్ణయం తీసుకున్నారు. పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నేతృత్వంలో 50 మంది రైతులు ‘ఛలో వారణాసి’ కార్యక్రమం చేపట్టారు.
Also Read : ప్రతీకారం: న్యూజిలాండ్ ఘటనకు రివేంజ్‌గా శ్రీలంకలో దాడులు
నిజామాబాద్ జిల్లాలోని అర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్లి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయాలని రైతులు భావిస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు మద్దతు ధర కల్పించనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతులు చెబుతున్నారు. తెలంగాణలోని నిజాబాబాద్ ఎన్నికల్లో ఏకంగా 176 మంది అభ్యర్థులు పోటీచేయడంతో దేశంలోనే తొలిసారి ఎం3 రకం ఈవీఎంలను వినియోగించి ఇక్కడ ఇక్కడ ఎన్నికలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పసుపు బోర్డు సాధనే లక్ష్యంగా పసుపు రైతులు వారణాసి నుంచి కూడా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు.
రేపు(24 ఏప్రిల్ 2019) మధ్యాహ్నం ఆలూరులో విలేఖరుల సమావేశం అనంతరం ఎంతమంది రైతులు వారణాసి వెళ్లబోతున్నారు. ఎంతమంది పోటీ చేయబోతున్నారు. అనే విషయాన్ని ప్రకటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పత్తయ్యే పసుపు భారత్ వాటా 80శాతం. దేశంలో పండించే పసుపులో తెలంగాణ వాటా 13శాతం ఉంటుంది. అందులో నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా పసుపును పండిస్తారు. ప్రస్తుతం క్వింటాల్ పసుపు ధర రూ.4,500 పలుకుతోంది. పసుపు పంటపై లక్షలకు లక్షలు పెట్టుబడి పెడుతుంటే ఈ ధర తమకు ఏ మాత్రం సరిపోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ. 10,000 మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ఇదే బెస్ట్ ఆప్షన్ : బ్యాంకుల్లోని మీ బంగారం భద్రమేనా?