గుత్తా సుఖేందర్ రెడ్డి MLC : నల్గొండ TRS MP వేమిరెడ్డి నర్సింహారెడ్డి

  • Published By: madhu ,Published On : March 21, 2019 / 03:12 PM IST
గుత్తా సుఖేందర్ రెడ్డి MLC : నల్గొండ TRS MP వేమిరెడ్డి నర్సింహారెడ్డి

Updated On : March 21, 2019 / 3:12 PM IST

TRS నల్గొండ లోక్ సభ స్థానాన్ని గులాబీ దళాధిపతి కేసీఆర్ ఎవరికి కేటాయించారు అనే దానిపై ఉత్కంఠ తొలగిపోయింది. గుత్తాను కాదని…వేమిరెడ్డి నర్సింహరెడ్డిని ఎంపిక చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఛాన్స్ వస్తుందని తెగ ప్రచారం జరిగింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్..వేమిరెడ్డి నర్సింహరెడ్డిని ఫైనల్ చేశారు. గుత్తాను ఎమ్మెల్సీగా కేసీఆర్ ప్రకటించారు. 

మార్చి 21వ తేదీ గురువారం ప్రగతి భవన్‌లో 16 స్థానాలకు TRS ఎంపీ అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫారాలు అందచేశారు. నల్గొండ ఎంపీగా బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావించారు. అందులో భాగంగా గుత్తాకు నో చెప్పి వేమిరెడ్డిని ఎంపిక చేశారు కేసీఆర్. ఇతను మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యాపార వేత్త.

తనకు ఎంపీ సీటు వద్దని..ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రివర్గంలో చేరాలని ఉందని గుత్తా..అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఆయన్ను పక్కకు పెట్టినట్లు టాక్. 
కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన గుత్తా..తరువాత జరిగిన ఫరిణామాలతో ‘కారు’ ఎక్కారు. మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఇప్పటికే ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయింది. ఈ స్థానం నుండి గుత్తాను ఎమ్మెల్సీగా ప్రకటించిన కేసీఆర్..త్వరలోనే కేబినెట్‌లోకి తీసుకొనే ఛాన్స్ ఉంది. శాసనసభ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏకంగా ఆరు చోట్ల గెలుపొందింది. 

పార్టీ అభ్యర్థి పేరు
TRS వేమిరెడ్డి నర్సింహారెడ్డి
BJP జితేంద్రకుమార్
CONG ఉత్తమ్ కుమార్ రెడ్డి