అమరావతిలో భారీ వర్షం : ఈదురుగాలులకు ఎగిరిపోయిన సచివాలయం రేకులు

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 10:30 AM IST
అమరావతిలో భారీ వర్షం : ఈదురుగాలులకు ఎగిరిపోయిన సచివాలయం రేకులు

Updated On : May 7, 2019 / 10:30 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ వర్షం కురిసింది. గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు సచివాలయంలోని నాలుగో బ్లాకులో రేకులు ఎగిరిపోయాయి. స్మార్ట్ పోల్ కుప్పకూలింది. సచివాలయంలో నిఘా కోసం స్మార్ట్ పోల్ ఏర్పాటు చేశారు. దీని ఖరీదు 15 లక్షలు ఉంటుందని అంచనా. స్మార్ట్ పోల్ ను చిన్న చిన్న బోల్టులతో ఫిట్ చేశారు. 

సచివాలయం గదుల నిర్మాణానికి తక్కువ పట్టుతో ఉన్న ఇటుకలు, టయల్స్ ను వినియోగించారు. అధికారుల నిర్లక్ష్యం, పనుల్లో నాణ్యత తేటతెల్లమైంది. పనుల్లో డొల్లతనం భయటపడింది. ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు సచివాలయం నాలుగో బ్లాకులో రేకులు ఎగిరిపోవడంతో గదుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఉద్యోగులు, సందర్శకులు ఎవరూ లేకపోవడంతో ప్రాణం నష్టం జరిగింది.  

లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా నీరు నిలిచింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సందర్శకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో అమరావతిలో వాతావరణం చల్లబడింది.