కచ్చులూరులో భారీ వర్షం : మూడోరోజు నిలిచిన బోటు వెలికితీత పనులు

కచ్చులూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మూడో రోజు బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. మూడోరోజు ఆపరేషన్‌ వశిష్ట తీవ్ర నిరాశనే మిగిల్చింది.

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 12:55 PM IST
కచ్చులూరులో భారీ వర్షం : మూడోరోజు నిలిచిన బోటు వెలికితీత పనులు

Updated On : October 2, 2019 / 12:55 PM IST

కచ్చులూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మూడో రోజు బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. మూడోరోజు ఆపరేషన్‌ వశిష్ట తీవ్ర నిరాశనే మిగిల్చింది.

కచ్చులూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మూడో రోజు బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. మూడోరోజు ఆపరేషన్‌ వశిష్ట తీవ్ర నిరాశనే మిగిల్చింది. నిన్న యాంకర్‌ విరగడంతో కొత్త యాంకర్‌తో ఇవాళ ప్రయత్నించినా.. బోటు మాత్రం చిక్కలేదు. సాయంత్రం జోరుగా వర్షం కురవడంతో వెలికితీత పనులను నిలిపివేశారు. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన బోటును బయటికి తీయడానికి ఇప్పటికే రెండ్రోజులపాటు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ధర్మాడి సత్యం నాయకత్వంలోని 25 మంది బృందం.. బోటును వెలికి తీసేందుకు సోమవారం నుంచి ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా మొదటి రోజు అవసరమైన సామగ్రి తరలించిన ధర్మాడి బృందం…  ఎర్రమట్టి బురదలో బోటు చిక్కుకుని ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. 

పడవ మునిగిందని భావిస్తున్న ప్రాంతంలో 300 మీటర్ల పొడవున్న ఇనుప తాడుతోపాటు కొక్కేలను పంటు ద్వారా గోదావరిలోకి వదిలారు. దానిని గోదావరి ఒడ్డున ఉంచిన జేసీబీలకు కట్టారు. పంటు ద్వారా నదీ గర్భం లోపలికి లంగర్లను దించి.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలింపు జరిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోటు, పంటుతోపాటు స్థానికులకు చెందిన ఏడు బోట్లను వాడారు. ఆ గాలింపులో తొలిరోజు ఇనుప కొక్కేనికి ఏదో బలమైనది తగలడంతో…. బోటు చిక్కిందని ఇక  దానిని వెలికితీయడమే తరువాయని అందరూ అనుకున్నారు. బోటు వెలికితీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయని ఆశించారు. కానీ నదిలోకి వదిలిన రోప్‌.. పైగి లాగుతుండగా తెగిపోయింది. దీంతో తొలిరోజు అనేష్వణ ఫలితాన్ని ఇవ్వలేదు. 

మొదటిరోజు ఫలితం దక్కకపోవడంతో రెండోరోజు మళ్లీ ప్రయత్నించింది ధర్మాడి సత్యం బృందం. మంగళవారం ఉదయాన్నే బోటు వెలికితీత పనులు చేపట్టింది. ఎన్నో ఆశల మధ్య మొదలుపెట్టిన రెండోరోజు ప్రయత్నాలు కూడా కొద్దిసేపటికే విఫలమయ్యాయి. నిన్న మరోసారి బోటు కోసం ధర్మాడి సత్యం బృందం లంగరు వేసింది. అయితే… అది విరిగిపోవడంతో కొక్కేనికి చిక్కినదానిని వెలికితీయడం సాధ్యపడలేదు. దీంతో అప్పటివరకూ ఉత్కంఠగా ఎదురు చూసిన వారంతా నిరాశకు గురయ్యారు.

200కు పైగా అడుగుల లోతున బోటు ఉండటం, నదిలో నీటి ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉండటంతో బోటు వెలికితీతకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు.. బోటు వెలికితీత కోసం రెండ్రోజులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో…ఆశలు సన్నగిల్లాయి. వరుసగా మూడోరోజు కూడా ధర్మాడి బృందం బోటు కోసం వేట సాగించింది. ఇవాళ ప్లాన్-2ను అమలు చేసింది. నిన్న యాంకరు విరిగిపోవడంతో ఇవాళ కొత్త యాంకరును నీటిలోకి వదిలింది. అయితే అది బోటుకు తగలలేదు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో.. సెర్చింగ్‌ ఆపరేషన్‌ను నిలిపివేశారు.