బిగ్ బ్రేకింగ్ : పోలవరం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • Published By: madhu ,Published On : October 31, 2019 / 11:30 AM IST
బిగ్ బ్రేకింగ్ : పోలవరం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Updated On : October 31, 2019 / 11:30 AM IST

పోలవరం నిర్మాణ విషయంలో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్‌పై స్టే ఎత్తివేసింది కోర్టు. 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..విచారణ ముగించింది. కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకొనేందుకు అనుమతిని ఇస్తూ తీర్పును వెలువరించింది. హైడెల్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ రద్దుపై నవయుగ సంస్థ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే పోలవరంపై సీఎం జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రూ. 850 కోట్లు ఆదా అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. 

పోలవరం హైడల్(జల విద్యుత్) ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ హైకోర్టుని ఆశ్రయించింది. సోమవారం (ఆగస్టు 19,2019) రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం (ఆగస్టు 20,2019) వాద ప్రతివాదనలు ముగిశాయి. తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని..కారణం లేకుండా కాంట్రాక్టును ఎలా రద్దు చేస్తారని నవయుగ సంస్థ తరపు అడ్వకేట్స్ ప్రశ్నించారు.

ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత…రిట్ పిటిషన్‌కు విలువ ఉండదన్న ఏజీ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలను ఎన్ క్యాష్ చేయకూడదంటూ..దిగువ కోర్టు ఇచ్చిన ఇన్ జంక్షన్‌ను హైకోర్టు పక్కన పెట్టింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పుబట్టింది. 

కాంట్రాక్టు రద్దు చేస్తే ఆర్బిటేషన్‌కు వెళ్లాలే..కానీ..హైకోర్టును ఆశ్రయించడం సరికాదని సర్కార్ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు తీర్పును రిజర్వ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. 
Read More : విశాఖకు మహర్దశ : ప్రతి ఇంటి అభివృద్దే జగన్ ధ్యేయం – విజయసాయి