జనవరి 7న హైపవర్ కమిటీ సమావేశం : జీఎన్‌రావు, బీసీజీ నివేదికలపై అధ్యయనం

రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ జనవరి 7వ తేదీన సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : January 5, 2020 / 09:59 AM IST
జనవరి 7న హైపవర్ కమిటీ సమావేశం : జీఎన్‌రావు, బీసీజీ నివేదికలపై అధ్యయనం

Updated On : January 5, 2020 / 9:59 AM IST

రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ జనవరి 7వ తేదీన సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ జనవరి 7వ తేదీన సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ రెండు కమిటీలు కూడా విశాఖను అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా ఉంచాలని సూచించాయి. ఇక ఈ రెండు నివేదికలపై అధ్యయనం చేయడానికి పదమంది మంత్రులతో హై పవర్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో పదిమంది మంత్రులు ఉన్నారు. ఈ నెలాఖరులోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 

 

(జనవరి 4, 2020) బీసీజీ కమిటీ రాజధానిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రపంచంలో గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీల నిర్మాణాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయని బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌(బీసీజీ) తన నివేదికలో వెల్లడించింది. ఏపీ రాజధాని అమరావతి విషయంలో అలాంటి ప్రయోగం రాష్ట్ర ప్రజలకు నష్టదాయకమని.. సంపదంతా ఒకే చోట పోగై మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించింది. అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికతో పాటు రాష్ట్రంలో 13 జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రపంచంలో గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు, రాజధాని నగరాల నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనం చేసిన బీసీజీ ప్రతినిధులు జనవరి3,శుక్రవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి నివేదిక సమర్పించారు.

 

ప్రపంచంలో గత 50 ఏళ్లలో….30కుపైగా గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీల (కొత్తగా నగరాన్ని నిర్మించడం) నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం రెండు నగరాలు మాత్రమే 50 శాతం లక్ష్యాన్ని సాధించాయని.. మిగతా మెగా సిటీలు 6–7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయని బోస్టన్‌ తన అధ్యయనం వెల్లడించింది. అధికార వికేంద్రీకరణ కోసం రెండు ఆప్షన్లు ఇస్తూ.. విశాఖ, అమరావతి, కర్నూలు పట్టణాల్లో పరిపాలనను వికేంద్రీకరించాలని సూచించింది.  లక్షల కోట్లు చొప్పున వెచ్చించి ప్రపంచంలో నిర్మించిన 30కి పైగా కొత్త నగరాల్లో అన్నీ కూడా లక్ష్యాలను సాధించలేక చతికలబడ్డాయి. 

ఆశించిన స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన గానీ, అభివృద్ధి గానీ సాధించలేకపోయారని బీసీజీ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. 1980 దశకంలో చైనాలో ప్రారంభించిన షెన్‌జెన్, భారత్‌లో నవీ ముంబయి మాత్రమే కొంతమేరకు లక్ష్యాల్ని సాధించాయని పేర్కొంది. మిగిలిన నగరాల నిర్మాణంతో ప్రజాధనం వృథా కావడం తప్ప వేరే ప్రయోజన మేమీ సాధించలేదని నివేదికలో తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్‌ సిటీలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తప్ప, సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏమాత్రం దోహదపడవని బీసీజీ విశ్లేషించింది.

‘గ్రీన్‌ఫీల్డ్‌ నగరాలు పర్యావరణ హితం కావు. ప్రపంచంలోని గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలను అధ్యయనం చేసిన తరువాత కాలుష్యం పెరగడాన్ని గుర్తించాం. రష్యాలో ఇన్నోపోలీస్, ఈజిప్టులో న్యూ కైరో, సదత్, షేక్‌ జియాద్‌ సిటీ, పోర్చుగల్‌లో ప్లాన్‌ ఐటీ వ్యాలీ, ఆస్ట్రేలియాలో మొనార్టో, చైనాలో చెంగాంగ్, కాంగ్‌బసీ ఆర్డోస్, నానుహీ న్యూ సిటీ, లావాసా, లాంజోహు, యూఏఈలోని మస్డర్‌ మెగా సిటీల నిర్మాణాల్లో లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు’ అని నివేదికలో వెల్లడించారు. ప్రపంచంలో గత 50 ఏళ్లలో 7 దేశాల కేపిటల్‌ సిటీల నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరుకుందని, మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేదని పేర్కొన్నారు.