మొఘలాయిలు మనకు హీరోలు ఎందుకవుతారు?..వారి గుర్తులు ఉండనివ్వం : CM వ్యాఖ్యలు

up-cm
ఉత్తరప్రదేశ్ లో ప్రముఖ చారిత్రాత్మక నగరమైన ఆగ్రాలో నిర్మితమవుతున్న మొఘల్ మ్యూజియం పేరును మరాఠా ఐకాన్ ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియంగా మారుస్తున్నామని సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం (సెప్టెంబర్ 14,2020) ప్రకటించారు. ఆగ్రా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం సమీక్షించారు. అనంతరం బానిస మనస్తత్వాలకు చెందిన ఏ ఒక్క గుర్తులను..రాష్ట్రంలో ఉంచటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే సీఎం యోగీ పలుకీలక వ్యాఖ్యలు చేశారు..‘మొఘలాయిలు మన హీరోలుగా ఎందుకవుతారు? అంటూ తాజ్ మహల్ నిర్మించిన షాజహాన్ ను ఉద్ధేశించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
మొఘలాయిలను హీరోలుగా ఎందుకు ఉండనివ్వాలని ప్రశ్నించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ మనకు హీరో అని అభివర్ణించిన ఆయన మొఘలాయిలు మనకు హీరోలు ఎలా అవుతారని ప్రశ్నిచారు.ఆగ్రాలో నిర్మిస్తున్న మ్యూజియం ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుతో పిలువబడుతుందని తెలిపారు. ఇకపై ఉత్తరప్రదేశ్ లో బానిస మనస్తత్వాలకు చెందిన ఎటువంటి ఆనవాళ్లు ఉండనివ్వమని స్పష్టం చేశారు.
కాగా..యూపీలో బీజేపీ ప్రభు్త్వం వచ్చిన నాటినుంచి యోగీ ఆదిత్యానాధ్ పలు ప్రాంతాల పేర్లను మార్చారన్న సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వచ్చినా యోగీ ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఈ క్రమంలోనే అలహాబాద్ పేరును ఆయన ప్రయాగ్ రాజ్ గా మార్చారు. 2015లో అఖిలేష్ యాదవ్ సీఎగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. తాజ్ మహల్ కు సమీపంలో ఆరు ఎకరాల స్థలంలో ఈ మ్యూజియంను, ప్రభుత్వం నిర్మించతల పెట్టింది. ఈ మ్యూజియంలో మొఘలుల సంస్కృతిని, వారి విలువైన వస్తువులు, చిత్రాలు, కళాఖండాలు, దుస్తులు, పాత్రలు, ఆయుధాలు తదితరాలను ప్రదర్శించాలన్నది ప్రభుత్వ నిర్ణయం.
https://10tv.in/kangana-ranaut-slams-sonia-gandhi-shiv-sena-over-free-kashmir-placard-controversy/
భారతావనిని మొఘలులు 1526 నుంచి 1857 వరకూ పాలించిన సంగతి తెలిసిందే. వారి పాలనలోనే ఆగ్రా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎన్నో భారీ నిర్మాణాలు జరిగాయి. ఎర్ర కోట, తాజ్ మహల్ వంటివి ఆ కోవలోనివే. అయితే, తమ మూడు శతాబ్దాల పాలనలో మొఘలులు హిందువులు లక్ష్యంగా దాడులు చేశారని, ఇబ్బందులు పెట్టారన్న ఆరోపణలపై చరిత్రకారులు విభిన్న వాదనలు చేస్తున్న సంగతి తెలిసిందే.