TDP ఎమ్మెల్యేలని YCP టార్గెట్ చేస్తోందా?

రాజధాని కోసం అమరావతి భూములు తీసుకోవడంలో టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి చూపించారంటూ వైసీపీ, తన ఆరోపణలకు తగిన ఆధారాలను సేకరిస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెరదీసి రైతుల నుంచి చౌకగా భూములన్నీ కాజేసిన టీడీపీ ప్రముఖుల పేర్లను జనం ముందుంచడమేకాదు, చట్టపరమైన చర్యకోసం వైసీపీ సిద్ధమవుతుందని అంటున్నారు.
పలు ఆధారాలు చూపిస్తూ ప్రముఖ తెలుగు మీడియా కథనాలు కూడా ప్రచురించింది. ఒకవేళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ చేసిన విచారణలో అవే నిజమని తేలితే టీడీపీ నేతలపై ఏం యాక్షన్ తీసుకుంటారు? ఎలాంటి సెక్షన్ల ప్రకారం.. చర్యలు తీసుకుంటారో తెలుసుకుందాం.
=> ఐపీసీ సెక్షన్ 418: ఓ లావాదేవీకి సంబంధించి ప్రయోజనాలను పరిరక్షించి తీరాల్సి ఉన్నా, నష్టం వస్తుందని తెలిసీ మోసానికి పాల్పడటం. ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష. జరిమానా, రెండూ విధించవచ్చు.
=> ఐపీసీ సెక్షన్ 420: వంచన లేదా మోసం ద్వారా ఆస్తిని బదలాయించడం. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ విధించవచ్చు.
=> ఐపీసీ సెక్షన్ 403: దురుద్దేశంతో ఆస్తిని దుర్వినియోగం చేయడం. ఈ నేరానికి గాను రెండేళ్ల జైలు శిక్ష. జరిమానా. రెండూ విధించవచ్చు.
=> ఐపీసీ సెక్షన్ 406: నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం. ఇందుకు గాను మూడేళ్ల జైలు శిక్ష. జరిమానా. రెండూ విధించవచ్చు
=> ఐపీసీ సెక్షన్ 409: ఆస్తి విషయంలో పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్ లేదా వ్యాపారి, ఏజెంట్ నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం. ఇందుకు గాను పదేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ విధించవచు.
నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు పరిసరాల్లో రాజధాని అంటూ కొందరు మంత్రులు ప్రచారం చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా అమరావతి రాజధాని అని తేలిన తర్వాత అమరావతి, గుంటూరు, తాడేపల్లి ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు భూములు లేవు. కారణం అప్పటికే పార్టీలో పెద్దలంతా అక్కడి స్థలాలు కొనుగోలు చేసేశారన్నది వైసీపీ మాట.