ఫేస్‌బుక్, పబ్‌జీతో సహా 89యాప్‌లు తీసెయ్యండి.. భారత సైన్యం సూచన

వ్యక్తిగత సమాచారం లీక్ కాకుండా నిరోధించడానికి ఫేస్‌బుక్, టిక్ టాక్, ట్రూ-కాలర్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా 89 యాప్‌లను తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి తొలగించాలని భారత సైన్యం తన సిబ్బందిని కోరింది. డేటింగ్ హంట్ న్యూస్ యాప్‌తో పాటు డేటింగ్ యాప్స్, టిండెర్, కౌచ్ సర్ఫింగ్ వంటి ఆటలు, పబ్-జీని తొలగించాలని ఆర్మీ సిబ్బందికి సూచనలు జారీ చేసింది భారత ఆర్మీ.
భారత ప్రభుత్వం నిర్ణయం మేరకు దేశంలో 59యాప్‌లను ఇప్పటికే నిలిపివేసింది గూగుల్ ప్లే స్టోర్. టిక్‌టాక్, యుసి బ్రౌజర్, షేర్‌ఇట్, వీచాట్‌తో సహా చైనీస్‌కు సంబంధించిన 59 యాప్‌లను భారత్ నిషేధించింది. ఈ యాప్స్ నిషేధం దేశ సార్వభౌమాధికారం, సమగ్రత మరియు భద్రత కోసం అని ప్రభుత్వం చెబుతోంది.
భారత్, చైనా మధ్య లడఖ్ సరిహద్దులో ఉద్రిక్తతల మధ్య, చైనా హ్యాకర్లు ఆన్‌లైన్‌లో కూడా భారత్‌పై దాడి చేస్తున్నారు. జూన్ 10నుంచి దాదాపు 100 కోట్ల మంది భారతీయులకు 24 కోట్ల మంది మొబైల్‌లలో ఇమెయిల్‌లు, బెదిరింపు సందేశాలు పంపబడ్డాయి. ఈ నకిలీ సందేశాల ద్వారా కంప్యూటర్లు మరియు మొబైల్‌లలోని సురక్షిత డేటాను దెబ్బతీయాలని చూశారు. అలాగే నెట్ బ్యాంకింగ్‌ను అదుపులోకి తీసుకోవాలనే ప్రయత్నం హ్యాకర్ల ఉద్దేశం. ఇటువంటి దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, హ్యాకర్లు చైనాలోని వివిధ యాప్‌ల ద్వారా భారతీయుల ఈ-మెయిల్‌లు మరియు మొబైల్ నంబర్లను సేకరించారు. డేటా ఉల్లంఘన నుంచి రక్షించడానికి సైనికులను ఈ యాప్‌లను ఉపయోగించవద్దని సైన్యం కోరిందని అంటున్నారు. జూన్ 10 న విడుదల చేసిన ఒక నివేదికలో గూగుల్.. సైబర్ దాడి గురించి సమాచారం ఇచ్చింది. ఇందులో చైనా పేరు ప్రస్తావించకుండా విదేశీ బెదిరింపు సందేశాలు భారత్‌కు పంపాయి.
Read Here>>నంగనాచిలా ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తున్న చైనా