రంజుగా AP రాజకీయాలు : IT సోదాలు..అధికారుల బదిలీలు

ఎన్నికల ఘడియలు దగ్గరపడే కొద్ది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి.

  • Published By: madhu ,Published On : April 10, 2019 / 01:19 AM IST
రంజుగా AP రాజకీయాలు : IT సోదాలు..అధికారుల బదిలీలు

Updated On : April 10, 2019 / 1:19 AM IST

ఎన్నికల ఘడియలు దగ్గరపడే కొద్ది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి.

ఎన్నికల ఘడియలు దగ్గరపడే కొద్ది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎంపీ గల్లా జయదేవ్‌ ఆడిటర్ గుర్రప్పనాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోదాలు చేశారు. జయదేవ్‌ ఎన్నికల ఖర్చుల వివరాలను ఆడిటర్ గుర్రప్పనాయుడు ప్రతిరోజు రిటర్నింగ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అయినా సోదాలు నిర్వహించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ

ఐటీ దాడులకు నిరసనగా గుంటూరులోని పట్టాభిపురంలో గల్లా జయదేవ్‌తోపాటు పలువురు అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమను టార్గెట్‌గా చేసుకొని కేంద్రం ఐటీ దాడులకు దిగుతోందని ఆరోపించారు. ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని, కేంద్రంలోని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ కుమ్మక్కై… కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

ఎన్నికల వేళ ఏపీ రాష్ట్రంలో అధికారులల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కీలక స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేసింది. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో పాటు ఇంటెలిజెన్స్ డీజీగా వెంకటేశ్వరరావును, రాష్ట్ర సీఎస్ గా పునేఠాను తప్పిస్తూ కీలక  నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ బదిలీలపై ఏపీ సీఎం బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా అక్కడ చుక్కెదురయ్యింది. కక్ష పూరితంగా కేంద్రం, ఈసీ వ్యవహరిస్తోందంటూ దుయ్యబడుతున్నారు. వైసీపీ నేతల ఒత్తిడి వల్లే అధికారులను బదిలీ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. 

తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో.. ప్రవీణ్‌పై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త ఎస్పీగా సిద్ధార్థ్ కౌశిక్‌ను  నియమించింది. అటు మంగళగిరి, తాడేపల్లి సీఐలపైనా ఈసీ బదిలీ వేటు వేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఐ శ్రీనివాసరావును.. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే ఈసీ బదిలీ చేసింది. సీఐ శ్రీనివాసరావు స్థానంలో సురేశ్ కుమార్‌ను నియమించింది.
Read Also : ట్విట్టర్ సీఈవో జీతం రూ. 100