జ‌న‌సేన తొలి జాబితా విడుదల: ఏపీలో తొలి పార్టీ ఇదే

  • Published By: vamsi ,Published On : March 14, 2019 / 12:57 AM IST
జ‌న‌సేన తొలి జాబితా విడుదల: ఏపీలో తొలి పార్టీ ఇదే

Updated On : March 14, 2019 / 12:57 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఏపీలో అసెంబ్లీకి పోటీ చేసే తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసిన పార్టీ జనసేనే కావడం విశేషం. జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు. 4 లోక్‌సభ స్థానాలకు, 32 శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది.
Read Also : యుద్ధానికి సేనాని సిద్ధం : పవన్ కళ్యాణ్ సమర శంఖం

ఖరారు చేసిన అభ్యర్థుల్లో మాజీ మంత్రులు రావెల కిషోర్‌ బాబు, పసుపులేటి బాలరాజు, శాసనసభ మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్‌, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌‌లు ఉన్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇచ్చారు. తొలి నుంచి పార్టీలో లేకుండా అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 8 మందికి జనసేన టిక్కెట్లను ఖరారు చేసింది. జాబితాలో పారిశ్రామిక వేత్తలు, విశ్రాంత అధికారులు చోటు దక్కించుకున్నారు.

పార్లమెంటు స్థానాలకు అభ్యర్ధులు:
అమలాపురం: డీఎంఆర్‌ శేఖర్‌
రాజమహేంద్రవరం: ఆకుల సత్యనారాయణ
విశాఖపట్నం: గేదెల శ్రీనుబాబు
అనకాపల్లి: చింతల పార్థసారథి

జనసేన పార్టీ అభ్యర్థులు:

1. రాజమండ్రి పార్లమెంట్ – డాక్టర్ శ్రీ ఆకుల సత్యనారాయణ
2. అమలాపురం పార్లమెంట్ – శ్రీ డి.ఎం.ఆర్ శేఖర్
3. విశాఖపట్నం పార్లమెంట్ – శ్రీ గేదెల శ్రీనుబాబు
4. అనకాపల్లి పార్లమెంట్ – శ్రీ చింతల పార్థసారథి#JANASENARevolution2019 #VoteForGlass pic.twitter.com/aYcolSQ4w4

అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు:
యలమంచిలి: సుందరపు విజయ్‌ కుమార్‌
పాయకరావుపేట: నక్కా రాజబాబు
పాడేరు: పసుపులేటి బాలరాజు
రాజాం: ముచ్చా శ్రీనివాసరావు
శ్రీకాకుళం: కోరాడ సర్వేశ్వరరావు
పలాస: కోత పూర్ణచంద్రరావు
ఎచ్చెర్ల: బాడాన వెంకట జనార్దన్‌ (జనా)
నెల్లిమర్ల: లోకం నాగ మాధవి
తుని: రాజా అశోక్‌బాబు
రాజమహేంద్రవరం గ్రామీణ: కందుల దుర్గేష్‌
రాజోలు: రాపాక వరప్రసాద్‌
పి.గన్నవరం: పాముల రాజేశ్వరి
కాకినాడ సిటీ: ముత్తా శశిధర్‌
అనపర్తి: రేలంగి నాగేశ్వరరావు
ముమ్మడివరం: పితాని బాలకృష్ణ
మండపేట: వేగుళ్ల లీలాకృష్ణ
తాడేపల్లిగూడెం: బొలిశెట్టి శ్రీనివాస్‌
ఉంగుటూరు: నౌడు వెంకటరమణ
ఏలూరు: రెడ్డి అప్పలనాయుడు
తెనాలి: నాదెండ్ల మనోహర్‌
గుంటూరు పశ్చిమ: తోట చంద్రశేఖర్‌
ప్రత్తిపాడు: రావెల కిషోర్‌బాబు
వేమూరు: ఏ.భరత్‌ భూషణ్‌
నరసరావుపేట: సయ్యద్‌ జిలానీ
కావలి: పసుపులేటి సుధాకర్‌
నెల్లూరు గ్రామీణ: చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి
ఆదోని: మల్లికార్జునరావు (మల్లప్ప)
ధర్మవరం: మధుసూధన్‌రెడ్డి
రాజంపేట: ప్రత్తిపాటి కుసుమ కుమారి
రైల్వేకోడూరు: బోనాసి వెంకట సుబ్బయ్య
పుంగనూరు: బోడె రామచంద్ర యాదవ్‌
మచిలీపట్నం: బండి రామకృష్ణ