కాసు మహేశ్ రెడ్డిపై తెదేపా కార్యకర్తల దాడి

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నికలు వాడీవేడిగా జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులకు నాయకులతో పాటు ఓటర్ల భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గంలో వైసీపీ నేతపై దాడి జరిగింది.
ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థి కాసు మహేశ్‌పై తెదేపా కార్యకర్తలు దాడికి దిగారు. 2 లక్షా 50వేల ఓట్లున్న నియోజకవర్గం కావడంతో ఎన్నికల కార్యకలాపాలను పరిశీలించే క్రమంలో కాసు మహేశ్ రెడ్డి ఏప్రిల్ 11 ఉదయం నుంచి పోలింగ్ బూత్ లు పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో గురజాల నియోజకవర్గంలో ఓ బూలింగ్ బూత్ పరిశీలించిన తర్వాత అక్కడే ఉన్న తెదేపా కార్యకర్తలు అతనికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని మహేశ్ రెడ్డి కారుపై దాడికి దిగారు. ఈ దాడికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పోలింగ్ సరళి చూసేందుకు వచ్చిన మహేశ్ రెడ్డికి భద్రత కల్పించలేకపోయారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.