కోడెల మృతిపై మేనల్లుడు అనుమానం: కొడుకే చంపేశాడు

  • Published By: vamsi ,Published On : September 16, 2019 / 11:29 AM IST
కోడెల మృతిపై మేనల్లుడు అనుమానం: కొడుకే చంపేశాడు

Updated On : September 16, 2019 / 11:29 AM IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణంపై అనుమానాలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేశారు కోడెల మేనల్లుడు సాయి. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కోడెలను కుమారుడు శివరామే హత్యచేశాడంటూ ఆరోపించారు సాయి.

ఈ మేరకు గుంటూరులోని సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో కోడెల కుమారుడు శివరాంపై ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా శివరాం కోడెలను వేధిస్తున్నాడని, కోడెలకు ఆత్మహత్య చేసుకునే అవసరమే లేదని అన్నారు సాయి.

తనను మానసికంగా కోడుకు వేధిస్తున్నాడని తనతో ఎన్నో సార్లు  కోడెల చిప్పినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సాయి వెల్లడించారు. తండ్రిని ఇబ్బంది పెట్టొద్దని పలుసార్లు శివరాంకు చెప్పినా వినలేదని, కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదని వివరించారు.

కోడెల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని సాయి డిమాండ్ చేశారు. ప్రస్తుతం కెన్యాలో ఉన్న కోడెల శివరాం తండ్రి మరణ వార్త తెలుసుకుని హుటాహుటీన ఏపీకి బయల్ధేరారు.