ఎవరు గెలుస్తారు : లోకేష్ Vs ఆళ్ల

  • Published By: madhu ,Published On : March 17, 2019 / 07:57 AM IST
ఎవరు గెలుస్తారు : లోకేష్ Vs ఆళ్ల

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈసారి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు కీలకంగా మారాయి. ఈ నియోజకవర్గాలపై అందరి చూపు నెలకొంది. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడ ఏపీ సీఎం బాబు కొడుకు నారా లోకేష్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి నిలిచారు. మార్చి 17వ తేదీ ఆదివారం జగన్ అసంబ్లీ, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలిచింది

ఎవరు గెలుస్తారనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేకుండానే ఎమ్మెల్సీ నామినేషన్‌తో ఏకంగా మంత్రి అయ్యారు లోకేష్. ఎక్కడి నుండి బరిలో నిలబట్టాలని బాబు తీవ్రంగానే కసరత్తు చేశారంట. సుదీర్ఘ లెక్కల అనంతరం మంగళగిరిని ఎంపిక చేశారు. ఇక్కడ బీసీ ఓటర్లు అత్యధికంగా ఉండటం…. అమరావతి రాజధాని కావడంతో.. మంగళగిరి అభివృద్ధి చెందిందనే భావన ఇక్కడి ప్రజల్లో ఉంది. మంగళగిరికి ఐటీ కంపెనీలు రావడంతో పాటు, అభివృద్ధి పనులు టీడీపీకి కలిసి వస్తాయనే భావనలో ఉన్నారు. లోకేశ్‌ పోటీ చేస్తే.. మంగళగిరి వాసులు.. ఓట్లతో ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతున్నారు టీడీపీ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల లెక్కలు కూడా చూశారు. ఇక్కడి నుండి పోటీ చేసిన టీడీపీ క్యాండిడేట్ కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనితో లోకేష్‌కి ఇది సేఫ్ ప్లేస్ అని బాబు ఫైనల్ చేశారని టాక్. లోకేష్ గెలుపుకోసం బాబు పక్కా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే..ఇతను వైసీపీ పార్టీకి చెందిన వారు. 2014 ఎన్నికల్లో 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఈయనకు మంగళగిరిపై పట్టు ఉంది. పేదల కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టారు ఆళ్ల. ఎక్కువగా ప్రభుత్వంపై కోర్టులో కేసులు వేస్తూ బిజీగా ఉన్నారు. అమరావతిలో నిబంధనలు పాటించడం లేదంటూ పలు పిటిషన్లు దాఖలు చేశారు. అంతేగాకుండా ఎమ్మెల్యేలపై అనర్హతల వేటు, ఓటుకు నోటు, సాధికార మిత్ర, సదావర్తి భూములు, జగన్‌పై దాడి..ఇలా కొన్ని పిటిషన్లు దాఖలు చేస్తూ ఫైటింగ్ చేస్తున్నారయన. 2019 ఎన్నికల్లో మరోసారి వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రంగంలోకి దిగుతున్నారు. లోకేష్ – ఆళ్ల మధ్య పోరు గట్టిగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు, ముస్లింల ఓట్లు అధికం. వీరే కీలకం కానున్నారు. ఎటు వైపు మొగ్గు చూపితే ఆ అభ్యర్థి విజయమంటున్నారు కొందరు. ఏపీ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగుతాయి. కౌంటింగ్ మాత్రం మే 23న కౌంటింగ్ జరుగునుంది. లోకేష్ గెలుస్తారా ? ఆళ్ల గెలుస్తారా అంటే మే వరకు వెయిట్ చేయాల్సిందే.