మావోయిస్టులకు ఎదురు దెబ్బ : పోలీసుల అదుపులో అగ్రనేత భార్య అరుణ?

  • Published By: madhu ,Published On : September 28, 2019 / 07:06 AM IST
మావోయిస్టులకు ఎదురు దెబ్బ : పోలీసుల అదుపులో అగ్రనేత భార్య అరుణ?

Updated On : September 28, 2019 / 7:06 AM IST

మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే విశాఖలో జరిగిన పోలీసుల కాల్పుల్లో అరుణ గాయపడినట్లు..ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిని ఏపీ పోలీసులు ధృవీకరించడం లేదు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులను ఏరివేసేందుకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు – పోలీసులు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలో ఎన్ కౌంటర్‌లో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈమె పేరు భవానీ అలియాస్ కళావతిగా గుర్తించారు. భవానీ రాష్ట్ర కమిటీ దళా కమాండర్‌గా ఉంది. ఈమె దళంలో కీలకంగా వ్యవహరించేది. గాయపడిన ఈమెను పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమండ్రి ఆస్పత్రిలో చేరిపించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చలపతి భార్య అరుణ పోలీసుల అదుపులో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిని పోలీసులు ధృవీకరించడం లేదు. విచారణలో భవానీ ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకొనే ఛాన్స్ ఉంది. అరుణ చిన్న వయస్సులోనే ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. 

అరుణ చిన్న వయస్సులోనే ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. ఇటీవలే ఏపీలో కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలకు అరుణ కీలక రోల్ పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈమె ఫాదర్ విజయవాడ నుంచి విశాఖకు దశాబ్దాల క్రితమే వచ్చి స్థిరపడ్డారు. ఇతనికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె చైతన్య అలియాస్ అరుణ. ఇంటర్ చదివే రోజుల్లో సామాజిక కార్యక్రమాల్లో చరుగ్గా ఉండేది. సారా వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొంది. ఆ తర్వాత మావోయిస్టులో చేరి అరుణగా పేరు మార్చుకుంది. ఈమె సోదరుడు కూడా మావోయిస్టులో చేరాడు. ఎన్ కౌంటర్‌లో ఇతను మరణించాడు. రామగూడ ఎన్ కౌంటర్‌లో అరుణ మృతి చెందిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తర్వాత తేలింది. 
Read More : వారికి కోరుకున్న చోటు ఇళ్లు : సీఎం జగన్ ఆదేశాలు