కౌన్సిలర్ ఇంట్లో దొంగల బీభత్సం : మంగళసూత్రంతో సహా మొత్తం దోచేశారు 

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 07:52 AM IST
కౌన్సిలర్ ఇంట్లో దొంగల బీభత్సం : మంగళసూత్రంతో సహా మొత్తం దోచేశారు 

Updated On : December 23, 2019 / 7:52 AM IST

నల్లగొండ జిల్లా ఈదుల గూడలో అర్థరాత్రి ముసుగు దొంగలు రెచ్చిపోయారు. వార్డు కౌన్సిలర్ ఇంట్లో నానా బీభత్సం సృష్టించిన నలుగురు దొంగలు భారీగా దోచేశారు. మారణాయుధాలతో వార్డు కౌన్సిలర్ ముద్దురెడ్డి నర్శింహారెడ్డి ఇంటిపై దాడి చేశారు.

తలుపులు పగుల గొట్టిన దుండగులు ఇంట్లో ప్రవేశించటంతో నర్శింహారెడ్డి కుటుంబ సభ్యులు హడలిపోయారు. కదిలితే చంపేస్తామంటు మారణాయుధాలతో బెదిరించారు. కుటుంబ సభ్యులందరినీ తాళ్లతో కట్టివేశారు. దీంతో భయపడినవారంతా ఎక్కడివారక్కడ బిగుసుకుపోయారు. ఈ క్రమంలో దొంగలు ఇంటిలో ఉండే  బంగారం, వెండి, నగదుతో పాటు విలువైన వస్తువుల్ని మూటకట్టుకున్నారు. అందినకాడికి దోచుకుపోయారు.

లాకర్లు పగుల గొట్టారు. కబోర్డ్స్ లో ఉండే అన్నీ లాగి పడేశారు. రూ.3లక్షల నగదు. ఈ ఘటనపై ముద్దురెడ్డి నర్శింహారెడ్డి మాట్లాడుతూ..భార్య మెడలో మంగళసూత్రంతో సహా 30 తులాల బంగారంతో పాటు.. వెండిని దోచుకుపోయారని వాపోయారు.