రివర్స్ టెండరింగ్ ఆదాపై ఏమంటారు చంద్రబాబు – మంత్రి అనీల్

  • Published By: madhu ,Published On : September 21, 2019 / 06:05 AM IST
రివర్స్ టెండరింగ్ ఆదాపై ఏమంటారు చంద్రబాబు – మంత్రి అనీల్

Updated On : September 21, 2019 / 6:05 AM IST

రివర్స్ టెండరింగ్‌తో రూ. 58 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని..ఈ విషయంలో ఏమంటారు బాబు ? ఎందుకంత భయం అని ప్రశ్నించారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్టు కాదని, అబద్దపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు ఆపేశారని అసత్య ప్రచారం చేస్తున్నారని, మ్యాక్స్ ఇన్ ఫ్రా 15.6 తక్కువ శాతానికి కోట్ చేసిందని వెల్లడించారు. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మంత్రి అనీల్ మీడియాతో మాట్లాడారు. 

వయస్సు పైబడి పోతోంది..చీఫ్ రాజకీయాలు మానుకోవాలన్నారు. ఉద్యోగ నియామక విషయంలో కూడా చిల్లర రాజకీయాలు టీడీపీ చేస్తోందన్నారు. ఇదే విధంగా చేస్తే..టీడీపీని శాశ్వతంగా ఇంటికి పంపించే రోజులు వస్తాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, టీడీపీ హాయాంలో ఇలా జరిగిందా ? అన్నారు మంత్రి అనీల్. 

నాలుగు లక్షల క్యూసెక్కులు పోతుంటే..పనులు జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. కమిషన్ల కోసం, కాపర్ డ్యామ్ మాత్రమే కట్టారని, రూ. 37 వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. నవంబర్ నుంచి రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు మొదలు పెడుతామన్నారు. 

రివర్స్ టెండరింగ్‌కు వెళితే ప్రభుత్వానికి లాభం ఉంటుందే..కానీ నష్టం ఉండదన్నారు. టెండర్లలో నవయుగ కంపెనీ కూడా పాల్గొనవచ్చని..చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా పాల్గొనవచ్చని సూచించారు. జగన్‌కు ఒక విజన్, సిస్టంను క్లీన్ చేయాలనే భావన..రాష్ట్ర ఖజానా కాపాడాలనే తపన ఉందన్నారు. తమ విధానాలను ఇతర రాష్ట్రాలు అవలంబించే రోజులు వస్తాయన్నారు. గత మూడు, నాలుగు సంవత్సరాల కింద తమ విధంగా చేస్తే..వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 
Read More : రాయలసీమకు వరదలు : కర్నూలు జిల్లాలో భారీ వర్షం