ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారు : మంత్రి కన్నబాబు

ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారని మంత్రి కన్నబాబు విమర్శించారు.

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 06:36 AM IST
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారు : మంత్రి కన్నబాబు

Updated On : December 9, 2019 / 6:36 AM IST

ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారని మంత్రి కన్నబాబు విమర్శించారు.

ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారని మంత్రి కన్నబాబు విమర్శించారు. మన వాళ్లే బ్రీఫ్డ్ మీ అని చెప్పి..చివరికి ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత పారి పోయి ఈ రాష్ట్రానికి వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీయే మద్దు అన్న చరిత్ర టీడీపీదేనని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చిపుచ్చుకోవండంపై తెలుగుదేశం పార్టీ నేతలకు తెలిసినంత ఎవరికి తెలియదని కన్నబాబు అన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీఫారమ్స్ కూడా ఇచ్చి పుచ్చుకున్నారని విమర్శించారు. పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి టీడీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. 

2014 నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ, గుంటూరులో ఆమరణ నిరాహారదీక్ష చేశారని, కలెక్టరేట్ల ముందు మహాధర్నాలు నిర్వహించారని గుర్తు చేశారు. యువభేరి కార్యక్రమాలు పెట్టి ప్రతిఒక్కరిని అందరికీ అవగాహన కల్పించారని తెలిపారు. వైసీపీకి సంబంధించి పార్లమెంట్ సభ్యులను రాజీనామా చేయించారని తెలిపారు. వైసీపీ పార్లమెంట్ సభ్యులను రాజీనామా చేయించేనాటికి టీడీపీకి ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని తెలిపారు. కనీసం చీమకుట్టినట్లైనా లేకుండా ప్రత్యేక హోదా అవసరం లేదని..ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని… ఫైనాన్స్ మినిస్టర్ కు కండువాలు, శాలువాలు కప్పిన చరిత్ర టీడీపీది అని విమర్శించారు. టీడీపీ నేతలు సభలో ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదు..ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఆయన చెప్పారని.. ఆ మాట వాస్తవమా కాదో అడగాలన్నారు. 

ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారని, జగన్ ను అందరూ అభిమానిస్తున్నారని రాత్రికి రాత్రే చంద్రబాబు యూటర్న్ తీసుకొని ప్యాకేజీ  కాదు..ప్రత్యేక హోదా చాంపియన్స్ తామే అని టీడీపీ నేతలు చెప్పుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర దెబ్బతీసి, ప్రత్యేక హోదా రాకపోయినా, ఇవ్వకపోయినా ప్యాకేజీతో సరిపెట్టుకుంటారని ఒక మైండ్ సెట్ ను క్రియేట్ చేసింది చంద్రబాబు అని అన్నారు. అది లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వడానికి బహుశా కేంద్ర ప్రభుత్వం ఆలోచించేదని చెప్పారు. కానీ చేతులారా ఉన్న అవకాశాన్ని పాడు చేసి, వీరు ఏం చేయలేరులే అన్న భావన కేంద్ర ప్రభుత్వంలో కల్పించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అని ఆరోపించారు. ఐదేళ్లపాటు ఏమీ చేయకుండా, ప్రత్యేక ప్యాకేజీ చాలని సీట్లు పంచుకుని దండలు వేసుకుని ఊరేగింపులు చేసుకున్నారని తెలిపారు. 

షీలా బీడే కమిటీ ఈ జనవరితో అయిపోయిందన్నారు. కమిటీ 89 రికమండేషన్స్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్ నాయకత్వంలో 68 రికమండేషన్స్ కు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, మన వాళ్లు మనకు బ్రీఫ్డ్ మీ అని చెప్పి..చివరికి ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత పారి పోయి ఈ రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. హైదరాబాద్ పది సంవత్సరాలుపాటు ఉమ్మడి రాజధాని ఉంటే..దాన్ని వదిలేసి కట్టుబట్టలతో వచ్చని పరిస్థితిని క్రియేట్ చేశారని తెలిపారు. చివరికి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్లందరూ కూడా సిగ్గుపడే, బాధ పడే పరిస్థితి తీసుకొచ్చారని తెలిపారు. చేసిందంతా చేసి ..ఇవాళ నీతి కథలు, పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు.

టీడీపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అధికారం, విభజన చట్టం హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఐదు నెలల పాటు ఏమీ చేయలేక కేవలం ఆరునెలల కాలంలో ఏదో జరిగిపోయింది.. పట్టించుకోలేదని మాట్లాడుతున్నారని అన్నారు. మోడీ అన్యాయం చేశారని విమర్శించి, మళ్లీ ఎన్నికల సమయంలో మోడీతో జతకట్టే ప్రయత్నం చేసి, నలుగురు ఎంపీలను బీజేపీకి వలస పంపించారని తెలిపారు.