ఖమ్మం జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు.

  • Published By: veegamteam ,Published On : March 1, 2020 / 02:54 AM IST
ఖమ్మం జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

Updated On : March 1, 2020 / 2:54 AM IST

తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు.

తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్‌ ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఖమ్మంలో జరిగే పట్టణప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు. నగరంలో మినీ ట్యాంక్‌బండ్‌ను, శాంతినగర్‌ జూనియర్‌ కళాశాలను, సీసీ కెమెరాల వాల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను, పెవిలియన్‌ గ్రౌండ్‌లో నూతనంగా నిర్మించిన బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియాన్ని, ఎన్సీపీ క్యాంప్‌లో నిర్మించిన వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ను మంత్రి ప్రారంభిస్తారు.

ఖమ్మం నగరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్‌ ఇష్టాగోష్టి నిర్వహిస్తారు. అనంతరం రఘునాథపాలెం వైఎస్సార్‌నగర్‌ కాలనీలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. కేటీఆర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు పాల్గొనున్నారు. 

మధ్యాహ్నం 12.30 గంటలకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరిగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు మంత్రి హాజరుకానున్నారు. అనంతరం ఇల్లెందు వెళ్లి అక్కడ పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు తిరిగి హైదరాబాద్‌ వెళ్లనున్నారు.