చంద్రగిరిలో చెవిరెడ్డి అరాచకం : నామినేషన్ ఉపసంహరించుకోమని బెదిరింపులు

  • Published By: chvmurthy ,Published On : March 26, 2019 / 04:20 PM IST
చంద్రగిరిలో చెవిరెడ్డి అరాచకం : నామినేషన్ ఉపసంహరించుకోమని బెదిరింపులు

Updated On : March 26, 2019 / 4:20 PM IST

తిరుపతి: తన పేరును పోలిన పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్ధిపై బెదిరింపులకు పాల్పడ్డారు  వైసీపీ నాయకులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ సీటుకు కె.భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. చంద్రగిరి నియోజక వర్గంలోని చిగురువాడ కె. భాస్కర్ రెడ్డి స్వగ్రామం. ప్రస్తుతం చంద్రగిరి నుంచి వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన అదృష్టాన్ని  మరోసారి పరీక్షించుకుంటున్నారు. 

ఇద్దరివీ ఒకే పేర్లు కావడంతో, ఓట్లు చీలిపోతాయని, చెవిరెడ్డి అనుచరులు కె.భాస్కర్ రెడ్డి పై  బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకే పేరుతో ఉండటంతో ఎన్నికల్లో నష్టపోతామని  వెంటనే   నామినేషన్‌  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చెవిరెడ్డి అనుచరులు ఇండిపెండెంట్‌ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లి బెదిరించారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్ధి భాస్కర్ రెడ్డి  సోమవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళి పోయాడు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కె. భాస్కర్‌రెడ్డి సతీమణి గీత ఎమ్మార్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో  మంగళవారం ఫిర్యాదు చేశారు.