నలుగురు పిల్లలకు పురుగులమందు తాగించి తల్లి ఆత్మహత్య

కర్నూలు జిల్లా డోన్ లోని తారకరామా నగర్ లో విషాదం చోటుచేసుకుంది. నలుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ తాగి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 07:42 AM IST
నలుగురు పిల్లలకు పురుగులమందు తాగించి తల్లి ఆత్మహత్య

Updated On : September 23, 2019 / 7:42 AM IST

కర్నూలు జిల్లా డోన్ లోని తారకరామా నగర్ లో విషాదం చోటుచేసుకుంది. నలుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ తాగి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

కర్నూలు జిల్లా డోన్ లోని తారకరామా నగర్ లో విషాదం చోటుచేసుకుంది. నలుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ తాగి తల్లి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఐదుగురిని కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో తల్లి మృతి చెందింది. నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.

తారకరామా నగర్ లో ఉంటున్న వరలక్ష్మీ అనే వివాహితకు నలుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు 8వ తరగతి, రెండో కూతురు ఉమాదేవి 4వ తరగతి, కుమారుడు ఉదయ్ 1వ తరగతి, ఐశ్వర్య సంవత్సరన్నర చిన్నారి. వరలక్ష్మీ నలుగురు పిల్లలకు పరుగుల మందు తాగించి.. అనంతరం తాను కూడా తాగింది. అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు ఐదుగురిని డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో తల్లి మృతి చెందింది. నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.