ఘోరం : బైక్-ఆర్టీసీ బస్ ఢీ..తల్లీ, రెండేళ్ల బాబు మృతి

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బొమ్మన చెరువు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బైక్ ను వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తల్లీ..రెండేళ్ల కుమారుడు అక్కడిక్కడే మృతి చెందారు. భర్త తీవ్ర గాయాలవ్వగా అతని పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది.
సుబ్రహ్మణ్యం, శివమ్మ దంపతులు తమ రెండు కుమారుడు రాజేశ్ ను వెంట పెట్టుకుని బైక్ పై రామకుదురు నుంచి మదనపల్లి వెళ్తున్నారు. ఈ క్రమంలో మదనపల్లి నుండి రామకుదురు వస్తున్న ఓ ఆర్టీసీ బస్ బొమ్మన చెరువు వద్ద ఉన్న మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొంది. ఈ ధాటికి శివమ్మ, చిన్నారి రాజేశ్ కింద పడిపోగా వారి పైనుండి బస్ ఎక్కటంతో వారిద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యంను హుటాహుటిన మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. కానీ అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.