My Villagae Show గంగవ్వ కొడుకు ఆత్మహత్యాయత్నం

  • Published By: madhu ,Published On : September 23, 2019 / 07:22 AM IST
My Villagae Show గంగవ్వ కొడుకు ఆత్మహత్యాయత్నం

Updated On : September 23, 2019 / 7:22 AM IST

యూ ట్యూబ్ సెన్సెషనల్ మహిళగా గుర్తింపు పొందిన గంగవ్వ కొడుకు రాజారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. పొలంలో పురుగు మందు తాగడాని సమాచారం. ఈయన్ను చూసిన గ్రామస్తులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గంగవ్వ హుటాహుటిన జగిత్యాలకు చేరుకుంది. కల్లు తాగి ఉండడంతో మత్తులో తాగి పడుకొని ఉండవచ్చునని మీడియా ఎదుట అనుమానం వ్యక్తం చేసింది గంగవ్వ. 

గంగవ్వ..యూ ట్యూబ్‌లో వీడియోలు ఎంతో ప్రజాదరణను పొందాయి. అచ్చమైన తెలంగాణ భాష..అమాయకమైన చూపులు..పంచ్‌లతో కేరాఫ్‌గా నిలుస్తోంది మై విలేజ్ షో ఫేం గంగవ్వ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లికి గ్రామానికి చెందిన గంగవ్వ ఒక దినసరి కూలిగా ఉండేది. ప్రస్తుతం పల్లెటూరి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగింది. పల్లెటూరి సంస్కృతిని చాటి చెప్పేందుకు శ్రీరాం శ్రీకాంత్ మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానెల్‌ను తీసుకొచ్చాడు.

గంగవ్వను ఆయన ఎంచుకుని వీడియోలు చేయడం ప్రారంభించాడు. అనతికాలంలోనే వీడియోలు తెగ ప్రాచుర్యం పొందాయి. ఇటీవలే గంగవ్వ సినిమా రంగంలోకి కూడా ప్రవేశించింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన మల్లేశం చిత్రంలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా నటించింది.