రిపబ్లిక్ డే : ఏపీ, తెలంగాణ శకటాలకు నో అన్న కేంద్రం…

  • Published By: madhu ,Published On : January 7, 2019 / 06:52 AM IST
రిపబ్లిక్ డే : ఏపీ, తెలంగాణ శకటాలకు నో అన్న కేంద్రం…

హైదరాబాద్ : జనవరి..26..రిపబ్లిక్ డే…సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. మీ శకటాలకు అనుమతి లేదంటూ కేంద్రం పేర్కొనడంపై ఇరు రాష్ట్రాల్లో ఆగ్రహాలు వ్యక్తమౌతున్నాయి. చివరకు శకటాలపై కూడా కేంద్రం కన్ను పడిందినే విమర్శలు వినిపిస్తున్నాయి. 
గణతంత్ర దినోత్సవాల్లో శకటాలు హైలెట్‌గా నిలుస్తుంటాయి. ఈసారి 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీజీ స్మరిస్తూ (150వ జయంతి) ఆయన జీవితంతో సంబంధం ఉండేలా ఆకృతులను తయారు చేయాలని…ఆగస్టు నెలలో రాష్ట్రాలకు కేంద్ర రక్షణ శాఖ సూచించింది. కేంద్రం చెప్పినట్లుగానే రాష్ట్రాలు శకటాలు రూపొందిస్తున్నాయి. ముందుగా కేంద్ర రక్షణ శాఖకు చూపించాల్సి ఉంటుంది. అందుల భాగంగా ఆయా రాష్ట్రాలు 3 డీ మోడల్స్ పంపాయి. ఏపీ సర్కార్…విజయవాడలోని గాంధీ కొండ, పుందూరు ఖద్దరు…మహిళలు బంగారం అందిస్తున్నట్లు…కొండపై గాంధీ ఉపదేశం ఇస్తున్నట్లు..శకటాన్ని రూపొందించింది. ఆఖరి రౌండ్‌లో తొలగిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దీనిపై ఏపీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఎందుకు తొలగించారో దానిపై సరియైన విధంగా చెప్పడం లేదని పేర్కొంటున్నారు. తెలంగాణ శకటానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కేంద్రం రాష్ట్రాల మధ్య సఖ్యత లేదనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొంటున్నారు.