జగన్‌కు ప్రత్యేకహోదా అడిగే ధైర్యం లేదు.. ప్రధానికి లేఖ రాస్తా: పవన్ కళ్యాణ్

‘జనసేన ఆత్మీయ యాత్ర’ పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడిగే ధైర్యం వైసీపీకి లేదని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో ఎందుకు కేంద్రాన్ని నిలదీయట్లదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
అలాగే రాష్ట్రంలోని రైతుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టట్లేదని, రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదని ఆరోపించారు. భారతి సిమెంట్ పరిశ్రమపై ఉన్న శ్రద్ధ కడప ఉక్కు పరిశ్రమపై జగన్‌కు ఎందుకు లేదని ప్రశ్నించారు.
వైసీపీ నాయకులపైన తనకేమీ కోపం లేదని, వారు తన శత్రువులు కాదని, వైసీపీ కార్యకర్తల్లో కూడా తన అభిమానులు ఉన్నారని అన్నారు పవన్ కళ్యాణ్. ‘నేను వారిని అడిగేది ఒక్కటే! జగన్ గారిని పద్ధతులు మార్చుకోమని చెప్పండి. ఒక ముఖ్యమంత్రిలాగా హుందాగా మాట్లాడి పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి. ’ అని అన్నారు పవన్ కళ్యాణ్. సీమలో ఉన్న వనరులు పాలకుల చేతుల్లోకి వెళ్లడంతోనే సీమ అభివృద్ధి జరగట్లేదని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్.