అఖిరా ఎమోషనల్ : పవన్‌ను చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి

  • Published By: madhu ,Published On : April 6, 2019 / 10:02 AM IST
అఖిరా ఎమోషనల్ : పవన్‌ను చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి

Updated On : April 6, 2019 / 10:02 AM IST

పవన్ కళ్యాణ్ కొడుకు ‘అకిరా నందన్’ ఎమోషనల్‌గా స్పందించాడు. తండ్రికి సపోర్టుగా ఓ పోస్టు చేశాడు. ఫేస్ బుక్ ద్వారా చిన్న సందేశాన్ని ఇచ్చాడు అకీరా. వడదెబ్బ తగిలినా..సరైన నిద్ర లేకున్నా..ప్రచారం చేస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని తెలిపాడు. ఓ వ్యక్తి ఎంతమేరకు కష్టపడాలో అంతమేర కష్టపడుతున్నారు. సర్వస్వం ధారపోస్తున్నారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఏపీ ఎన్నికల్లో భాగంగా జనసేన అధ్యక్షుడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో ప్రచారం చేస్తుండగా వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే..ఒకరోజు రెస్టు తీసుకోవాలని చెప్పడంతో పవన్ ప్రచారానికి బ్రేక్ వేశారు. పవన్‌కు సపోర్టుగా మెగా కుటుంబం నిలుస్తోంది. మెగా కుటుంబంలో ఒకరైన నాగబాబు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ప్రచారంలోకి దిగాడు. అల్లు అర్జున్ డైరెక్ట్‌గా ప్రచారం చేయకపోయినా తన సపోర్టు ఉంటుందని ప్రకటించాడు. తాజాగా అకిరా నందన్..పవన్‌కు సంబంధించిన వీడియోలు, ఇతరత్రా విషయాలు ఫేస్ బుక్‌లో పోస్టు చేస్తున్నాడు. 

‘బద్రీ’ సినిమాతో ఏకమైన పవన్..రేణు దేశాయ్‌లు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తరువాత అభిప్రాయ బేధాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఈ జంటకు ఇద్దరు పిల్లలు…అఖిరా నందన్, ఆద్యా. విడాకులు తీసుకున్న అనంతరం రేణూ పూణేలో నివాసం ఉంటోంది.