ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో పిల్

రాజధాని కేసులను వాదించేందుకు న్యాయవాదికి 5 కోట్లు ఇస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని…. హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి మండలం వైకుంఠపురానికి చెందిన సుధాకర్ బాబు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. కోటి రూపాయలు అడ్వాన్సుగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా అంత డబ్బు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని సుధాకర్‌బాబు పిల్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రణాళికాశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.