అప్పుడు చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

  • Published By: vamsi ,Published On : January 17, 2020 / 06:31 AM IST
అప్పుడు చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

Updated On : January 17, 2020 / 6:31 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సవాల్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి గురించి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి వైసీపీ గెలవాలని, అలా చేస్తే.. అప్పుడు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ చంద్రబాబు చేసిన సవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని అన్న చంద్రబాబు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికలను అమరావతికి రెఫరెండంగా తీసుకునేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందించాలని తూర్పుగోదావరి జిల్లా నుమ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 151 సీట్లు అందిస్తే.. ఇంతలోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనడం చేతగానితనమన్నారు సుభాష్ చంద్రబోస్. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైపీదే మళ్లీ విజయమని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.