పోలింగ్ సిబ్బంది ఓవరాక్షన్ : ఫ్యాన్‌కు వేయమంటే.. సైకిల్‌కి నొక్కింది

గుంటూరు : పోలింగ్ బూత్ లలో కొంత మంది అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వృద్ధుల ఓటు విషయంలో తారుమారు చేస్తున్న సంఘటన వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నూజండ్ల మండలం పమిడిపాడులో అధికారిణి ఓవరాక్షన్ చేసింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ఓ వృద్దురాలు కోరింది. సరే అని చెప్పిన ఆ అధికారిణి.. తీరా ఈవీఎం దగ్గరికి వెళ్లాక ఫ్యాన్ గుర్తుకి బదులు టీడీపీ గుర్తుకి ఓటు వేసింది. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ అధికారిణి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓటర్ల ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారిణిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని వృద్ధురాలు చెప్పటం.. పోలింగ్ అధికారిణి సైకిల్ గుర్తుకు వేయటంపై వైసీపీ పోలింగ్ బూత్ ఏజెంట్లు కంప్లయింట్ ఫైల్ చేశారు. రీ పోలింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారిపై చర్యలు తీసుకోవటంతోపాటు.. ఓటును రీకాల్ చేయాలని ఆందోళనకు దిగారు. విషయాన్ని C-విజిల్ యాప్ ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారిణిపై చర్యలు తీసుకోవటంతోపాటు.. రీ పోలింగ్ పెట్టాలనే డిమాండ్ చేస్తున్నారు. దీంతో పమిడిపాడు గ్రామంలో టెన్షన్ నెలకొంది.