కరోనా పేషెంట్ ని ఆస్పత్రికి తీసుకెళ్లటానికి 7కి.మీటర్లకు రూ. 8వేలు తీసుకున్న అంబులెన్స్ డ్రైవర్

  • Published By: nagamani ,Published On : July 9, 2020 / 06:24 PM IST
కరోనా పేషెంట్ ని ఆస్పత్రికి తీసుకెళ్లటానికి 7కి.మీటర్లకు రూ. 8వేలు తీసుకున్న అంబులెన్స్ డ్రైవర్

Updated On : July 9, 2020 / 6:42 PM IST

కరోనా పేరుతో దోపిడీలు సాధారణంగా మారిపోయాయి. కరోనా పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు..ఇటు మెడికల్ షాప్స్ దోపిడీలకు పాల్పడుతున్నారు. అంతేకాదు అంబులెన్స్ అంటే సర్వీస్ కోసమేఅనుకునే మాట మారిపోయింది. కరోనా పేరుతో వారు కూడా దోపిడీలకు తెరతీశారు. కరోనా పేషెంట్ ను ఆస్పత్రికి తీసుకెళ్లటానికి ఓఅంబులెన్స్ డ్రైవర్ డబ్బులిస్తేనే గానీ తీసుకెళ్లేది లేదని తెగేసి చెప్పిన ఘటన పూణెలో జూన్ 25న వెలుగు చూసింది.

బిబ్వేవాడీ ప్రాంతంలోని ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు రావటంతో అతను కరోనా పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్ వచ్చింది. దీంతో అతను ఎరండ్వానే ప్రాంతంలో ఉన్న దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స చేరాలని చెప్పారు.
అక్కడికి వెళ్లాలంటే ట్రాన్స్ పోర్ట్ సమస్య ఉండటంతో అంబులెన్స్ లోనే వెళ్లాలి. దీంతో అతను ఓ అంబులెన్స్‌ను సంప్రదించాడు. ఆసుపత్రికి వెళ్లాలంటే అతను ఉన్నప్రాంతానికి 7 కిమీల దూరం ఉంది.

దానికి అంబులెన్స్ నిర్వాహకుడు 1 కి.మీకి రూ. 1,142 చొప్పున మొత్తం రూ.8 వేలు అడిగాడు. దీంతో పాపం బాధితుడు జేబులు తడుముకున్నాడు. అంబులెన్స్‌కే ఇంత ఇవ్వాల్సి వస్తే..ఇక ఆసుపత్రిలో ఇంకెత ఇచ్చుకోవాలో అని ఆందోళన చెందాడు. వేరే దారి లేక అంబులెన్స్ లోనే వెళ్లి ఆస్పత్రి లో అడ్మిట్ అయ్యాడు.

ఈ విషయం తెలిసిన జిల్లా అధికారులు అంబులెన్స్ నిర్వహకుడిపై విపత్తు నిర్వహణ చట్టం, మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు. కరోనా సోకిందని తెలిసి కూడా.. కేవలం 7 కి.మీ.ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించడానికి అతను తీసుకోవటంపై మండిపడుతున్నారు ప్రజలు. కరోనా పేరుతో సంపాదన లేక నానా కష్టాలు పడుతుంటే ఈ దోపిడీలు ఏంటీ ప్రజల్ని బ్రతకనివ్వరా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.