రోడ్డు ప్రమాదంలో చనిపోయారని పోస్టులు : కంగారు పడి ఫోన్లు చేస్తున్న బీజేపీ నేతలు

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన గురించి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులకు

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 10:25 AM IST
రోడ్డు ప్రమాదంలో చనిపోయారని పోస్టులు : కంగారు పడి ఫోన్లు చేస్తున్న బీజేపీ నేతలు

Updated On : August 28, 2019 / 10:25 AM IST

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన గురించి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులకు

మాజీ మంత్రి, బీజేపీ ప్రధాన కార్యదర్శి మాణిక్యాల రావు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన గురించి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చనిపోయానని పోస్టులు పెడుతున్నారని కంప్లయింట్ లో తెలిపారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని, బెదిరింపులకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని మాణిక్యాల రావు పోలీసులను కోరారు.

తన గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారు ఓ పార్టీకి చెందిన వాళ్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ వాళ్ల పనే అని బీజేపీ నేతలు, మాణిక్యాల రావు అనుచరులు ఆరోపిస్తున్నారు. మాణిక్యాల రావు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. వీటిని చూసి నిజమనుకుని కంగారుపడిన బీజేపీ నేతలు, అభిమానులు మాణిక్యాల రావు ఆఫీస్ కి ఫోన్లు చేస్తున్నారు. అలాంటిదేమీ లేదని మాణిక్యాల రావు చెప్పడంతో అంతా రిలాక్స్ అయ్యారు. వరుసగా ఫోన్లు రావడంతో.. మాణిక్యాల రావు.. అసలేం జరిగిందని ఆరా తీశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు గుర్తించారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొన్ని రోజుల క్రితం వైసీపీ నేతలు, మాణిక్యాల రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీంతో వైసీపీకి చెందిన వారు ఇలా తప్పుడు ప్రచారం చేసి ఉంటారని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ పైనా మాణిక్యాల రావు మండిపడ్డారు. అభివృద్ధిని, సమస్యలను పట్టించుకోకుండా నీరోలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రైస్తవ మత ప్రచారానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. సీఎం జగన్ రాష్ట్రంలో చర్చిలు నిర్మిస్తామని చెప్పడం సరికాదన్నారు. దేవాలయ భూములు ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం విరమించుకోవాలన్నారు. హైకోర్టు అనుమతితో దేవాలయ భూములను పంచిపెట్టే ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. క్రిస్టియన్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని మాణిక్యాల రావు చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వం కళ్లు మూసుకుందా అని ప్రశ్నించారు. అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్ దేవాలయాల భూములు అనుచరులకు పంచి పెడుతున్నారని మాణిక్యాల రావు ఆరోపించారు.