వైసీపీలోనే నాపై కుట్ర జరుగుతుంది: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

  • Published By: vamsi ,Published On : November 20, 2019 / 04:11 AM IST
వైసీపీలోనే నాపై కుట్ర జరుగుతుంది: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Updated On : November 20, 2019 / 4:11 AM IST

పార్లమెంట్‌లో తెలుగు గురించి మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురైనట్లు వచ్చిన వార్తలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. జగన్ తనపై సీరియస్ అయిన విషయం నిజమే అని అన్నారు రఘురామ కృష్ణంరాజు. పార్లమెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలు తెలుగు అకాడమీ నిధుల గురించి మాత్రమే అని తెలిపారు. ఇంగ్లీష్‌ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడాను అనేది పచ్చి అవాస్తవం అని అన్నారు.

ఇంగ్లీష్ మీడియంకు తాను వ్యతిరేకం కాదని.. తెలుగు భాష కోసం టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాత్రమే చెప్పానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. తెలుగు అకాడమీని పునరుద్ధరించి కేబినేట్ హోదాతో ఛైర్మన్‌ను కూడా నియమించిందని,  అకాడమీ విభజన ఇంకా పూర్తికాకపోవడంతో.. నిధులు ఆగిపోయాయని, త్వరగా.. అకాడమీకి నిధులు ఇవ్వాలని మాత్రమే కోరినట్లు తెలిపారు రఘురామ కృష్ణంరాజు.

తెలుగు భాషను పట్టించుకోట్లేదు అని మాట్లాడితే, తెలుగు అకాడమీకి రావలసిన నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని అడిగితే తన మాటలను వక్రీకరించారు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మాత్రమే తాను కోరినట్లు వెల్లడించారు. వైవీ సుబ్బారెడ్డి గారికి కూడా ఇదే విషయమై వివరణ ఇచ్చినట్లు చెప్పారు. పార్లమెంట్ లో మాట్లాడిన విషయం తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. పార్టీలోనే కొన్ని శక్తులు నాకు, జగన్‌కు కమ్యునికేషన్ గ్యాప్ క్రియేట్ చేస్తున్నాయని అన్నారు.

ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే డైరెక్ట్‌గా కలిసి వివరణ ఇస్తానని అన్నారు. రాజ్యాంగంలో అధికరాలను ఉపయోగించి భాషా పరిరక్షణ గురించి మాత్రమే మాట్లాడానని అన్నారు. పార్టీలో నాపై కుట్ర జరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అనే మాటే నా నోటి నుంచి రాకూడదు అనుకుంటే ఎలా? అలా ముఖ్యమంత్రి గారు అనుకుంటారు అనుకోవట్లేదు అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ముఖ్యమంత్రి గారికి ఎవరో వ్రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారని, ఎవరు ఇచ్చారనేది నేను చెప్పను కానీ పార్టీలో నాపై కుట్ర మాత్రం జరుగుతుంది అన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కి ఢిల్లీలో నేనే అకాంబిడేషన్ ఇచ్చానని పుకార్లు క్రియేట్ చేశారని అన్నారు. పద్దతి ప్రకారం నాపై అనుమానాలు క్రియేట్ చేస్తున్నారని,
విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి గారు ఈ విషయాలను అర్థం చేసుకుంటారని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి గారికి కూగా దీనిపై వివరణ ఇచ్చినట్లు చెప్పారు.